జాతీయ వార్తలు

తీర ప్రాంత రక్షణకు రాణిగైడిన్లు రక్షణ నౌక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, అక్టోబర్ 24: కృష్ణ పట్నం పోర్టు తీరప్రాంత పరిరక్షణకు కోస్టుకార్డు పరిధిలో రాణిగైడిన్లు అనే రక్షణ నౌక ఓడరేవు భూ భాగంలో ఉండడం చాలా సంతోషకరమని, పోర్టు సెక్యూరిటికి అదనపు బలం లాంటిదని ఓడరేవు సిఇఓ అనిల్‌కుమార్ అన్నారు. సోమవారం విశాఖపట్నం ఓడరేవు నుంచి ఇండియన్ కోస్టుగార్డు పరిధిలో రాణిగైడిన్లు రక్షణనౌక కృష్ణపట్నం ఓడరేవులో లంగరు వేసింది. ఈసందర్భంగా భారత తీరప్రాంత రక్షక దళం కమాండర్లు వేణుమాధవ్, పోర్టు అధికారులు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రక్షణ నౌకను ఉద్దేశించి సిఇఓ మాట్లాడుతూ 34 నాటికల్ మైళ్ల వేగంతో రాణిగైడిన్లు అనే రక్షణనౌక ప్రయాణిస్తుందని ఈనౌకలో ఒక కెప్టెన్‌తోపాటు 34మంది సిబ్బంది ఉంటారని సిఇఓ తెలిపారు. ప్రధానంగా సముద్ర తీరప్రాంత భూభాగం ద్వారా ఉగ్రవాదులు భారతదేశం భూ భాగంలోకి చొరబడకుండా ఈ రక్షణ నౌక అన్ని వేళలా గస్తీ నిర్వహిస్తుందని శత్రువుల కదలికలను కనిపెట్టడంలో మంచి నైపుణ్యం కలదని సిఇఓ పేర్కొన్నారు. కోస్టుగార్డు అధికారులు, పోర్టు సెక్యూరిటీ సిబ్బంది కలసి రక్షణ నౌకద్వారా తీరప్రాంతంలో భద్రత నిర్వహిస్తారని అన్నారు.
ఎగుమతులు, దిగుమతుల కార్యకలాపాలకు సంబంధించి నిఘా భద్రతకు ఈ రక్షణ నౌక ఎంతగానో దోహద పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోస్టుగార్డు అధికారులు రమేష్, పోర్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. కృష్ణపట్నం తీరంలో సోమవారం లంగరు వేసిన రక్షణ నౌక