జాతీయ వార్తలు

ఫిబ్రవరిలో మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఏపి శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. మహిళా సాధికారిత లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించనున్నట్టు సోమవారం ఇక్కడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మిట్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ సహకారంతో ఏపి నూతన రాజధానిలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. సదస్సులో పాల్గొనాలని ఢిల్లీలో పలువురు ప్రముఖులను కలసి ఆహ్వానించారు. ముందుగా ఆధ్యాత్మిక గరువు దలైలామాను కలసి ఈ సదస్సుకు హాజరుకావాల్సిందిగా కోడెల ఆహ్వానించారు. సదస్సుకు దలైలామా వస్తారని స్పీకర్ వెల్లడించారు. అనంతరం కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరిని కలసి సదస్సుకు ఆహ్వానించారు. దీనిపై వారందరూ సానుకూలంగా స్పందించారని కోడెల చెప్పారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీని కూడా సదస్సుకు ఆహ్వానించన్నుట్టు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల్లో పేరుగాంచిన మహిళలు, ఇతర దేశాల నుంచి కూడా మహిళా ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని ఆయన తెలిపారు. కోడెల వెంట ఎంపీ మాగంటిబాబు, శాసనసభ కార్యదర్శి సత్యనారాయణ తదితరులున్నారు.

చిత్రం.. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనాలని కేంద్ర మంత్రి అశోక గజపతి రాజును ఆహ్వానిస్తున్న కోడెల