జాతీయ వార్తలు

‘హజీ అలీ’లోకి మహిళలూ రావొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ఇప్పటివరకు పురుషులు మాత్రమే ప్రవేశించడానికి అవకాశం ఉన్న ముంబయిలోని చరిత్రాత్మక హజీ అలీ దర్గాలోకి ఇకనుంచి మహిళలు కూడా ప్రవేశించి ప్రార్థనలు చేయవచ్చు. దర్గా ట్రస్టు సోమవారం సుప్రీంకోర్టుకు ఈ విషయం చెప్పింది. బొంబాయి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దర్గాలోకి మహిళలు ప్రవేశించి, ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా వౌలిక సౌకర్యాలు కల్పించడానికి, అవసరమైన మార్పులు చేయడానికి ట్రస్టుకు అత్యున్నత న్యాయస్థానం నాలుగు వారాల సమయం ఇచ్చింది. హజీ అలీ దర్గా ట్రస్టు స్ర్తి పురుష సమానత్వాన్ని విశ్వసిస్తోందని ట్రస్టు తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణియం ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలో న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఎల్.నాగేశ్వరరావులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు. బొంబాయి హైకోర్టు ఆదేశాల ప్రకారం దర్గాలోకి మహిళలు ప్రవేశించడానికి అనుమతిచ్చినంత కాలం తమకు ఎలాంటి సమస్య లేదని పేర్కొంటూ ట్రస్టు దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం పరిష్కరించింది. దర్గాలోకి మహిళల ప్రవేశానికి అనుమతించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ట్రస్టు ఒక అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసినట్లు గోపాల్ సుబ్రమణియం ధర్మాసనానికి చెప్పారు. అయితే మహిళల ప్రవేశానికి వీలు కల్పించేందుకు దర్గాలో అవసరమైన మార్పులు చేయడానికి రెండు వారాల సమయం కావాలని ఆయన ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం నాలుగు వారాల సమయం ఇచ్చింది.