జాతీయ వార్తలు

ఎన్నికల ప్రచారాంశంగా పరిశుభ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: వచ్చే ఎన్నికల్లో పరిశుభ్రత అనేది ఎన్నికల ప్రచారాంశం అవుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. నగరాలు, పట్టణాలలో నివసించే ప్రజలు పరిశుభ్రత కోసం పాటుపడే పార్టీలకే ఓటు వేస్తారని ఆయన పేర్కొన్నారు. పరిశుభ్రత అనేది రాజకీయ అంశం కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ భారత్ మిషన్’ సమర్థవంతంగా అమలవుతుందని ఆయన ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎన్‌డిఏ ప్రభుత్వం భారత్‌ను బహిరంగ మలవిసర్జన లేని దేశంగా తీర్చిదిద్దడం సహా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలోని అన్ని లక్ష్యాలను 2019నాటికి సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఎన్‌డిఏ భాగస్వామ్య పక్షమైన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పి) ఈ వారంలో పార్టీలో అంతర్గతంగా ‘స్వచ్ఛ్ అభియాన్ సమితి’ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు సంవత్సరాల క్రితం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసికెళ్లేందుకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్‌ఎల్‌ఎస్‌పి పేర్కొంది.