జాతీయ వార్తలు

‘సమాన పనికి సమాన వేతనం’ సూత్రం తాత్కాలిక ఉద్యోగులకూ వర్తిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే ఒకే రకమైన విధులను నిర్వర్తించే డెయిలీ వేజ్ ఉద్యోగులు, క్యాజువల్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ‘సమాన పనికి సమాన వేతనం’ సూత్రాన్ని వర్తింపజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడాన్ని శ్రమ దోపిడీ, అణచివేతగా అభివర్ణించిన సుప్రీంకోర్టు సంక్షేమ రాజ్యంలో ఈ సూత్రాన్ని తాత్కాలిక ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలన్నారు. ‘మా దృష్టిలో శ్రమశక్తి ఫలాలు తరిస్కరించడానికి కృత్రిమ కొలమానాలను సృష్టించడం దారుణం’ అని కోర్టు పేర్కొంది. ఒక పని చేసే ఉద్యోగికి అదే పని, బాధ్యతలు నిర్వర్తించే మరో ఉద్యోగికన్నా తక్కువ వేతనం చెల్లించ కూడదని, అలాంటి చర్య మానవత్వ విలువలనే కించపరచడం అవుతుందని న్యాయమూర్తులు జెఎస్ కేహర్, ఎస్‌ఏ బోబ్డేలతో కూడిన బెంచ్ పేర్కొంది. తక్కువ జీతానికి పని చేసే వాళ్లెవరైనా ఇష్టపూర్తిగా ఆ పని చేయరు. ఆత్మ గౌరవం, మర్యాదలను పణంగా పెట్టి తన కుటుంబానికి కూడూ, గూడు కల్పించడం కోసమే ఆ పని చేస్తాడు. తాను తక్కువ వేతనాన్ని అంగీకరించకపోతే తన కుటుంబం తీవ్రంగా కష్టపడుతుందని అతనికి తెలుసు. అందువల్ల అదే స్థాయిలో ఉండే ఇతరులకన్నా తక్కువ వేతనం చెల్లించడం అంటే మానవత్వ విలువల మూలాలనే కించపరచడమే అవుతుందని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికలోని 7 అధికరణాన్ని ఉటంకిస్తూ బెంచ్ పేర్కొంది. తాత్కాలిక ఉద్యోగులకు రెగ్యులర్ పేస్కేలులోని కనీస వేతనాన్ని పొందడానికి అర్హులు కారని పంజాబ్, హర్యానా హైకోర్ట ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పంజాబ్ ప్రభుత్వంలోని కొంతమంది తాత్కాలిక ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో బెంచ్ ఈ తీర్పు ఇచ్చింది.