జాతీయ వార్తలు

పాక్‌కు గట్టి గుణపాఠం చెప్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుద్గామ్, నవంబర్ 3: జమ్మూ, కాశ్మీర్‌లో పాకిస్తాన్ పరోక్ష యుద్ధం సాగిస్తోందని, అయితే పొరుగు దేశానికి గట్టిగా బుద్ధిచెప్పడం జరుగుతుందని రక్షణ మణత్రి మనోహర్ పారికర్ అన్నారు. ‘జమ్మూ, కాశ్మీర్‌ను ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ ఎప్పుడూ అనుకుంటూనే ఉంది. అయితే కాశ్మీర్, ఇక్కడి ప్రజలు భారతదేశంలో అంతర్భాగంగా మేము భావిస్తున్నాం. ముఖాముఖి యుద్ధాల్లో పరాజయం ఎదుర్కొన్న తర్వాత పాకిస్తాన్ ఈ భూతల స్వర్గంపై పరోక్ష యుద్ధం సాగిస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాలపై కూడా అది దాడులు చేస్తోంది. అయితే మన సైనికులు సైనికంగానే దీన్ని ఎదుర్కొంటున్నారు’ అని పారికర్ అన్నారు. కాశ్మీరీ ప్రజల సంక్షేమం కోసం పాటుపడే, వారిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. దారితప్పిన యువత ఇప్పుడు కాశ్మీర్ సంస్కృతిని దెబ్బతీస్తోందని, పాఠశాలలను తగులబెట్టడం ద్వారా చిన్నారుల భవిష్యత్తును నాశనం చేస్తోందని అన్నారు. పాఠశాలల్లో సంపాదించే విజ్ఞానం శాశ్వతమైందని అందువల్ల విద్యాలయాలు ఎంతో ముఖ్యమైనవని ఆయన అన్నారు. ఈ సమస్యపై దృష్టిపెట్టాలని తాను సైనికాధికారులను కోరానని, అయితే పాఠశాలలను కాపాడడానికి గ్రామాలనుంచి కూడా ఒత్తిడి రావాలని అన్నారు. జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రం ఆర్థికంగా, ముఖ్యంగా సమాచారం, పర్యాటక రంగాల్లో ఎదగడానికి ఎన్నో అవకాశాలున్నాయని, కాశ్మీర్ సహజ అందాలకు ఏవీ సాటిరావని అన్నారు. హింసను విడనాడి దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.