జాతీయ వార్తలు

జకీర్ నాయక్ ఎన్‌జిఓపై ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: వివాదాస్పద ఇస్లామిక్ మత బోధకుడు జకీర్ నాయక్ నడుపుతున్న ఐఆర్‌ఎఫ్ ఎడ్యుకేషనల్ ట్రస్టును ముందస్తు అనుమతితోనే విదేశీ విరాళాలను స్వీకరించాలనే స్వచ్ఛంద సంస్థల జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. దీంతో ఇకనుంచి కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ సంస్థ విదేశాలలోని వ్యక్తులు, సంస్థల నుంచి విరాళాలు స్వీకరించడానికి వీలులేదు. ఐఆర్‌ఎఫ్ ఎడ్యుకేషన్ ట్రస్టు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్స్ యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఎ) 2010లోని వివిధ నిబంధనలను ఉల్లంఘించినట్టు అందుబాటులో ఉన్న రికార్డులు, నిఘా సంస్థల నుంచి అందిన నివేదికలను బట్టి తెలిసిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ మేరకు జారీచేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. నాయక్ తన స్వచ్ఛంద సంస్థ నిధులను యువకులలో ఛాందసవాదాన్ని నింపడానికి, వారిని ఉగ్రవాద కార్యకలాపాలలోకి ప్రోత్సహించడానికి వినియోగించినట్లు వేర్వేరు దర్యాప్తుల్లో తేలినందున ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి.