జాతీయ వార్తలు

తిట్టుకోవడంలో వారు బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహరాన్‌పూర్, నవంబర్ 5: సమాజ్‌వాది పార్టీలో అంతఃకలహాలు పెచ్చరిల్లాయని, ఒకరినొకరు తిట్టుకోవడంలో వాళ్లు బిజీ అయపోయారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. ఇక బిఎస్‌పి అధినేత్రి మాయావతికి వీరిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శనివారం సహరాన్‌పూర్‌లో పరివర్తన్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఎస్పీ, బిఎస్పీ పాలన కారణంగా రాష్ట్రం అభివృద్ధిలో ఎంతో వెనకబడిపోయిందన్నారు. బిజెపి ఒక్కటే యుపి ప్రజలను కాపాడగలదని, దౌర్జన్యాలను నిలువరించగలదని అన్నారు. ఈ రెండు పార్టీలు గూండాలు, అవినీతితో కుళ్లిపోయాయని, ఈ రెండు పార్టీల్లో ఏది మంచిదో తెలియని పరిస్థితి రాష్ట్ర ప్రజలదని అన్నారు. మాయావతి పాలనను ప్రస్తావిస్తూ అభివృద్ధికోసం కేటాయించిన కోట్లాది నిధులను ఆమె తన విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఖర్చు చేశారన్నారు. ఒకవేళ మాయావతిని గనుక మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి బదులు మరో రెండు మూడువందల విగ్రహాలు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమానికి అమిత్‌షాతో పాటు కేంద్ర మంత్రి కల్‌రాజ్ మిశ్రా, పార్టీ సీనియర్ నేతలు కేశవ్ ప్రసాద్ వౌర్య, సంజీవ్ బల్యాన్, సంగీత్ సోమ్ తదితరులు హాజరయ్యారు. సహరాన్‌పూర్‌లో శనివారం ప్రారంభమైన ర్యాలీతోపాటుగా 6న ఝాన్సీ, 8న బలియా, 9న సోన్‌భద్రనుంచి కూడా ర్యాలీలు ప్రారంభమవుతాయి. ఈ పరివర్తన్ ర్యాలీల్లో కొన్నింటిలో ప్రధాని మోదీ కూడా పాల్గొంటారు. డిసెంబర్ 24న లక్నోలో జరిగే చివరి ర్యాలీలో సైతం మోదీ పాల్గొంటారు.

చిత్రం.. యుపిలోని సహరాన్‌పూర్‌లో బిజెపి నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా