జాతీయ వార్తలు

దేశ భద్రతే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 5: ఎన్‌డిటివి చానల్‌పై ఎన్‌డిఎ ప్రభుత్వం ఒకరోజు నిషేధం విధించడం అత్యవసర పరిస్థితిని తలపిస్తోందంటూ కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు శనివారం తీవ్రంగా ఖండించారు. దేశ భద్రత కోసమే ప్రభుత్వం ఆ చానల్‌పై ఈ చర్య చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు. మీడియా స్వేచ్ఛపట్ల ఎన్‌డిఏ ప్రభుత్వానికి ఎనలేని గౌరవం ఉందని, ఇటువంటి అంశాలకు రాజకీయ రంగు పులమడం వలన దేశ భద్రతకు ముప్పు వాటిల్లడం తప్ప ఒరిగేదేమీ ఉండదని ఆయన పేర్కొన్నారు. ఎన్‌డిటివి చానల్‌పై ఎన్‌డిఎ ప్రభుత్వం చర్య చేపట్టడం ఎమర్జెన్సీ కాలంలోని చీకటి రోజులను గుర్తుకు తెస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వెంకయ్య నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటువంటి చర్య చేపట్టడం ఇదే తొలిసారి అని వారు ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. భారతదేశ మ్యాప్‌ను తప్పుగా చూపించినందుకు అల్‌జజీరా చానల్‌పై ఐదు రోజులు, ఎబిఎన్ చానల్‌పై ఏడు రోజులు, ఎంటర్-10 చానల్‌పై ఒక రోజు, ఎఫ్‌టివి చానల్‌పై రెండు నెలలు, ఎఎక్స్‌ఎన్ చానల్‌పై రెండు నెలలు చొప్పున నిషేధం విధించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్‌డిఎ ప్రభుత్వమే తొలిసారి ఇటువంటి నిషేధం విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని వెంకయ్య నిప్పులు చెరిగారు. దేశ విస్తృత ప్రయోజనాలకు ఏది అవసరమో ప్రజలు అర్థం చేసుకోగలరని, మంచి ఏదో, చెడు ఏదో వారికి తెలుసని ఆయన పేర్కొన్నారు. అందుకే ఎన్‌డిటివి చానల్‌పై ఎన్‌డిఎ ప్రభుత్వం చేపట్టిన చర్యను అందరికీ తెలిసిన కొంతమంది వ్యక్తులు మినహా ప్రజలు పెద్దసంఖ్యలో సామాజిక మాధ్యమాల ద్వారా సమర్థించారని వెంకయ్య నాయుడు తెలిపారు.

చిత్రం.. బిల్డర్స్ అసోసియేషన్ వజ్రోత్సవాల సందర్భంగా శనివారం చెన్నైలో సావనీర్‌ను విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు