జాతీయ వార్తలు

ఎమర్జెన్సీని గుర్తుచేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: ఎన్‌డిటివి ఇండియా న్యూస్ చానల్‌పై కేంద్రం ఒక రోజు నిషేధం విధించడంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం శనివారం మరింత తీవ్రమైంది. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ నిషేధం విధించినట్లు కేంద్రం అంటుండగా, ఈ చర్య రెండో ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తోందని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. పఠాన్‌కోట్‌పై ఉగ్రవాద దాడి దృశ్యాలను ప్రసారం చేసినందుకుగాను కేంద్రం ఈ నెల 9వ తేదీన ఒక రోజు ప్రసారాలు నిలిపివేయాలని కేంద్రం ఎన్‌డిటివిని ఆదేశించడం తెలిసిందే. కేంద్రం చర్యను బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, జెడి(యు) నేత శరద్ యాదవ్, డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి, బిఎస్‌పి అధినేత్రి మాయావతి, ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ తదితర ప్రతిపక్ష నేతలు తీవ్రంగా దుయ్యబడుతూ, ఇది భావప్రకటనా స్వేచ్ఛకే అవమానమని, దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి ఇది నిదర్శనమని సిపిఎం పొలిట్ బ్యూరో దుయ్యబట్టింది. దేశానికి స్వేచ్ఛాయుత, నిష్పాక్షికమైన మీడియా అవసరమని ఒక ప్రకటనలో నితీశ్ అన్నారు. కేంద్రం గనుక ఇలాంటి చర్యలను కొనసాగిస్తే అది మరో ఎమర్జెన్సీకి దారి తీస్తుందని, నాటి చీకటి రోజులు ఇప్పటికీ జనం మనసుల్లోంచి చెరిగిపోలేదని డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి అన్నారు. ఈ చర్య తనకు ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందని అన్నారు. నరేంద్ర మోదీ, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశాన్ని ఎమర్జెన్సీ, నియంతృత్వ పాలనవైపు తీసుకెళ్తున్నారని లక్నోలో సమాజ్‌వాది పార్టీ రజతోత్సవ సభలో మాట్లాడుతూ లాలూ దుయ్యబట్టారు.