జాతీయ వార్తలు

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: పెట్రోలు, డీజిలు ధరలు శనివారం మరోసారి పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 89 పైసలు పెరగ్గా, డీజిలు ధర లీటరుకు 86 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రినుంచి అమలులోకి వస్తాయని దేశంలో అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) ప్రకటించింది. వ్యాట్, స్థానిక పన్నులను కలుపుకొంటే ఈ పెరుగుదల మరికాస్త ఎక్కువే ఉంటుంది. పెరిగిన ధరల తర్వాత ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ.67.62 పైసలు ఉండగా, డీజిలు ధర లీటరు రూ.56.41కి చేరుకుంటుంది. అంటే ఇంతకు ముందుకన్నా పెట్రోలు రూ.1.17, డీజిలు రూ.1.03 పెరుగుతుంది. కాగా, గత సెప్టెంబర్‌నుంచి పెట్రోలు ధరలు పెరగడం ఇది ఆరోసారి కాగా, డీజిలు ధర ఒక నెలలోనే మూడోసారి పెరిగింది. తాజా పెరుగుదలతో కలుపుకొని పెట్రోలు ధర గత సెప్టెంబర్ 1నుంచి ఇప్పటివరకు కేవలం రెండు నెలల్లో లీటరుకు రూ.7.53 పెరిగినట్లయింది.