జాతీయ వార్తలు

అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: భారత్ వంటి పేద దేశంలో అవినీతికి స్థానం ఉండకూడదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రభుత్వం విధానపరమైన స్పష్టతతో ముందుకు వెళ్లాలని, వ్యక్తుల ఇష్టాయష్టాలు ఇందుకు ప్రాతిపదిక కాకూడదని తెలిపారు. సోమవారం నాడిక్కడ జరిగిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారోత్సవాల ముగింపు సభలో మాట్లాడిన ప్రధాని ఆధార్‌సహా టెక్నాలజీతో అనుసంధానమైన విధానాలద్వారా అవినీతిని అంతం చేయాలన్నారు. ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉండటం వల్లే అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. చట్టం, నిబంధనలు, వ్యవస్థ అన్ని విధాలుగా పటిష్టంగా, ఇతరత్రా ఎలాంటి అన్వయింపులకు ఆస్కారం లేకుండా ఉన్నప్పుడే అవినీతిని నిర్మూలించడం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. పాలనకు సంబంధించిన ముసాయిదా చట్టాలను రూపొందించేటప్పుడు ప్రజలకు ప్రమేయం కల్పించాలని.. అలాంటప్పుడే మంచి చట్టాలురావడానికి, పరిపాలన సజావుగా సాగడానికి వీలుంటుందని చెప్పారు. అలాగే, నిజాయితీగా పనిచేసే ఉద్యోగుల్ని ప్రోత్సహించడంతో పాటు వారి భద్రతకు భరోసా ఇవ్వడమే ప్రభుత్వ కర్తవ్యమని అన్నారు. దేశంలోని మెజార్టీ సామాన్య ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీపరులేనని పేర్కొన్న ఆయన ఇంత మంది మంచిగా, నిజాయితీగా పనిచేస్తున్నప్పటికీ కేవలం కొందరి వల్లే ప్రభుత్వ ఉద్యోగులందరూ అవినీతి పరులేనన్న ముద్ర పడుతోందని అన్నారు.తమకు రక్షణ కల్పించాలంటూ బొగ్గు గనులు, స్పెక్ట్రమ్ కుంభకోణాల్లో కేసుల్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత, మాజీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత చేకూరింది. చట్టాలంటే ప్రజలకు భయం లేకపోవడం నిజమేనని పేర్కొన్న మోదీ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఇదే రకమైన భావన ఉందన్నారు. అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండయ్యే ఉద్యోగికి..సస్పెన్షన్ కాలంలో సగం జీతం వస్తుందని తెలుసునని చెప్పారు. సస్పెన్షన్ తర్వాత జరిగే విభాగపరమైన దర్యాప్తును ‘మేనేజ్’ చేసుకోవచ్చుననీ భావిస్తాడని, మొత్తం దర్యాప్తు పూర్తయిన తర్వాత బకాయిలతో సహా మళ్లీ ఉద్యోగం వస్తుందని మోదీ అన్నారు. ఇలాంటి వ్యవస్థ కారణంగానే నిజాయితీగా పనిచేసే వారికి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఇలాంటి వారికి అన్ని విధాలుగా భద్రత కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. అన్ని స్థాయిల్లోనూ ఈ రకమైన నిజాయితీని బలోపేతం చేసేందుకు ఈ రకమైన చర్యలు ఎంతగానో ఉపయోగ పడతాయని వెల్లడించారు.

సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారోత్సవాల సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.
చిత్రంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కె.వి. చౌదరి