జాతీయ వార్తలు

సినిమా షూటింగ్‌లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, నవంబర్ 7: ఓ కన్నడ సినిమా షూటింగ్‌లో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగళూరులో షూటింగ్ జరుగుతుండగా ఇద్దరు నటులు రిజర్వాయర్‌లో మునిగిపోయారు. హెలికాప్టర్‌లో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హీరో విజయ్‌తోపాటు ఉదయ, అనిల్ తిప్పగొండనహళ్లి నదిలో దూకారు. విజయ్ సురక్షితంగా బయపడగా మిగతా ఇద్దరూ నీళ్లలో మునిగిపోయారు. మధ్యాహ్నం 2.48 గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక, ఎమర్జెన్సీ సర్వీసు దళానికి సమాచారం అందించినా ఫలితం లేకపోయింది. హెలికాప్టర్ నుంచి నీట్లో దూకే సమయానికి అక్కడో బోటును ఏర్పాటు చేశారు. అయితే సకాలంలో బోటు అక్కడకు చేరుకోకపోవడం వల్లే విషాదం జరిగిందని అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిత్రం యూనిట్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌చేసి సమాచారం అందజేసింది. ఇద్దరు నటులు మునిగిపోయారని, గాలింపు చర్యలు చేపట్టాల్సిందిగా కోరినట్టు అధికారులు వెల్లడించారు.