జాతీయ వార్తలు

ఆగని పనామా సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ‘పనామా’ సాలెగూడులో బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా చిక్కుకుంటున్నారు. బిగ్‌బీ అమితాబ్ కుటుంబం తరువాత తాజాగా సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, ఆమె సోదరి కరిష్మాకపూర్‌ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరితోపాటు, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్‌కు చెందిన కంపెనీలు, పుణెలోని రియల్టర్‌లు కార్డియా కుటుంబానికి విదేశీ కంపెనీల్లో పెట్టుబడులున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గురువారం తాజాగా పదిమంది పేర్లను బయటపెట్టింది. ఐపీఎల్ పుణె ఫ్రాంచైజ్‌కు కూడా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లోని అబ్డ్యురేట్ లిమిటెడ్‌లో 15శాతం వాటా ఉన్నట్లు ప్రకటించింది. స్పోర్ట్ కన్సార్టియంలో కార్డియా కుటుంబానికి 33శాతం వాటా, కరీనా, కరిష్మాకపూర్ సోదరీమణులకు చెరో 4.5శాతం వాటా, సైఫ్ అలీఖాన్‌కు 9శాతం వాటా ఉన్నట్లు వెల్లడించింది. పి-విజన్ స్పోర్ట్స్‌లో పారిశ్రామికవేత్త వేణుగోపాల్ ధూత్‌కు 25శాతం వాటా ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్పందించేందుకు నటుడు సైఫ్ అలీఖాన్ ఇష్టపడలేదు. కరీనా కపూర్ కార్యాలయం మాత్రం ఆమె నగరంలో లేరని వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారంపై రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ, భారతీయులు విదేశాల్లో ప్రారంభించిన ప్రతి కంపెనీ చట్టవ్యతిరేకమైనది కాదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు బృందం ఈ వ్యవహారాన్ని విచారిస్తోందని అన్నారు.

చిత్రం కరీనా, కరిష్మా కపూర్‌లతో సైఫ్ అలీఖాన్ (ఫైల్ ఫొటో)