జాతీయ వార్తలు

ఎంపీ బిజెపికి ‘పెద్ద’ పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, నవంబర్ 17: మధ్యప్రదేశ్‌లో షాదోల్ లోక్‌సభ, నేపానగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం జరగనున్న ఉప ఎన్నికలు అధికార బిజెపికి అగ్నిపరీక్షగా మారింది. 500, 1000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. రెండు నియోజకవర్గాలకు సంబంధించి ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఉప ఎన్నికలు జరుగుతున్న రెండు నియోజకవర్గాలు ఎస్‌టి రిజర్వ్ సీట్లు. రెంటిలో ఏ ఒక్కస్థానాన్ని కోల్పోయినా అధికార బిజెపికి ఇబ్బందికర పరిస్థితేనని చెప్పవచ్చు. పెద్దనోట్లను రద్దు చేసిన కేంద్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు రగిలిపోతున్నారని, ఉప ఎన్నికల్లో కచ్చితంగా బిజెపికి గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. అయితే నోట్లు రద్దు ప్రభావం ఉప ఎన్నికలపై ఉండదని, షాదోల్ లోక్‌సభ, నేపానగర్ అసెంబ్లీ స్థానాలకు మంచి మెజారిటీతో గెలుచుకుంటామని బిజెపి నేతలు ధీమాగా ఉన్నారు. పెద్దనోట్లను రద్దుచేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంవల్ల ప్రజలందరూ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారని, ముఖ్యంగా సామాన్యులు, రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ యాదవ్ చెప్పారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు రైతులు నానాఅగచాట్లుపడుతున్నారని అన్నారు. రెండు ఎస్‌టి నియోజకవర్గాల్లోనూ అధికార బిజెపికి పరాజయం తప్పదని యాదవ్ జోస్యం చెప్పారు. పంటలకు సరిపడా విద్యుత్ అందక, గిట్టుబాటు ధర లేక ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ పరిస్థితుల్లో పెద్దనోట్ల రద్దు మరింత దెబ్బతీసిందని కాంగ్రెస్ చీఫ్ తెలిపారు. గిరిజన నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికలపె నోట్ల రద్దు ప్రభావం ఉండదని రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ హితేశ్ బాజ్‌పాయ్ స్పష్టం చేశారు. భూములపై లీజు హక్కులు, గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంతో వారంతా సంతోషంగా ఉన్నారని, ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని ఆయన ధీమాగా చెప్పారు.