జాతీయ వార్తలు

స్వచ్ఛ ప్రచారంలో హైదరాబాద్‌కు 3వ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: స్వచ్ఛ భారత్ అవగాహన ప్రచారంలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. తిరుపతికి ఎనిమిదో స్థానం దక్కింది. గురువారంనాడు స్వచ్ఛ భారత్ అవగాహన ప్రచారంలో ముందున్న పది పట్టణాల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ విడుదల చేసింది. స్వచ్ఛ భారత్ అవగాహన ప్రచారంలో దేశ వ్యాప్తంగా 500 పట్టణాల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఆలీగఢ్ ప్రథమ స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో వసాయ్-విరార్ (మహారాష్ట్ర), నాలుగో స్థానంలో గురుగ్రామ్ (హర్యానా), ఐదోస్ధానంలో చండీగఢ్, ఆరో స్థానంలో మధురై (తమిళనాడు), ఏడో స్థానంలో వడోదర, రాజ్‌కోట్ (గుజరాత్), తొమ్మిదో స్థానంలో మైసూర్ (కర్ణాటక) నిలిచాయి. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ సర్వేక్షణ్-2017 పేరుతో మూల్యాంకనం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యానవనాలు, నివాస స్థలాలు, పర్యాటక ప్రదేశాలు, పాఠశాలల్లో పరిశుభ్రత ఆధారంగా మూల్యాంకనం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 తది ఫలితాలను 2017 జనవరిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించనుంది.