జాతీయ వార్తలు

క్షమాపణ చెప్పను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఉరీలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిలో మరణించిన వారి కంటే రెండింతల మంది నోట్ల కోసం క్యూలో నిలబడి చనిపోయారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేప్రసక్తే లేదని రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఆజాద్ పార్లమెంటు వాయిదా పడిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికంటే ఎక్కువ మంది కొత్త నోట్ల కోసం క్యూలో నిలబడి మరణించారనడంలో తప్పేముందని ప్రశ్నించారు. ప్రతిపక్షాన్ని దెబ్బతీసేందుకు బిజెపి రక రకాల ఎత్తులు వేస్తోందని అన్నారు. ఎన్‌డిఏకు చెందిన పలువురు మంత్రులు ఆజాద్‌పై విమర్శలు గుప్పించారు. ఆజాద్ ప్రకటనను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తుందని మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుపట్టారు.
వెంకయ్యతో జైరాం వాగ్వాదం
రాజ్యసభలో గురువారం సాయంత్రం ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై సెంట్రల్ హాల్‌లో సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘ఆజాద్ వ్యాఖ్యలను మీరు వక్రీకరిస్తున్నారు’ అని జైరాం చెప్పారు. వెంకయ్య నాయుడు స్పందిస్తూ ‘రాజ్యసభ రికార్డులను పరిశీలిద్దాం. నేను చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తాను. మీరు చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తారా?’ అని జైరాం రమేష్‌ను నిలదీశారు. మీరిలా మాట్లాడటం సబబు కాదని జైరాం అనగా ‘గులాం నబీ ఆజాద్ బాధ్యతారహితంగా మాడ్లాడవచ్చా?’ అంటూ వెంకయ్యనాయుడు ఎదురు ప్రశ్నించారు.