జాతీయ వార్తలు

డాక్టర్ నుంచి రూ.70 లక్షలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని పహార్‌గంజ్ ప్రాంతంలో ఓ పిల్లల డాక్టర్ నుంచి 70 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదంతా వంద రూపాయల నోట్లేనని పోలీసులు వెల్లడించారు. నల్లాల్ అనే వైద్యుడు వంద రూపాయల నోట్ల కట్టలను కారులో తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. 69,86,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, అవన్నీ వంద రూపాయల నోట్లేనని పోలీసులు తెలిపారు. డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారి అయిన తన స్నేహితుడు ఆ నగదు తన వద్ద ఉంచాడని వైద్యుడు చెప్పారు. రాజౌరీ గార్డెన్‌లోని తన ఇంట్లో నగదు దాచినట్టు విచారణలో ఆయన అంగీకరించారు. ఈ విషయాన్ని ఐటి శాఖ దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.