జాతీయ వార్తలు

మాకు వేరే పనిలేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ‘మేమంటే పట్టదా.. ప్రజల ప్రాణాలపై ఇంత నిర్లక్ష్యమా..’దేశంలోని కరవు కాటకాలపై ప్రభుత్వాల ధోరణిని ఎండగడుతూ సర్వోన్నత న్యాయస్థానం వ్యక్తం చేసిన ఆగ్రహమిది. దేశ వ్యాప్తంగా నెలకొన్న కరవు పరిస్థితులపై రెండో రోజైన గురువారం విచారణ కొనసాగించింది. విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ హాజరు కాక పోవడం పట్ల న్యాయమూర్తులు ఎమ్‌బి లోకూర్, ఎన్‌వి రమణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇతర పనుల కారణంగా ఆయన రాలేకపోయారంటూ జూనియర్ లాయర్ వివరణ ఇవ్వడంతో ‘ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు వేరే పని లేదు. ఇక్కడ కూర్చుని గడియార్ చూడటమే పని’అని చురకులు వేశారు. మండుటెండలు, వర్షాభావ పరిస్థితులకు రైతాంగం తల్లడిల్లుతున్నా ఈ వాస్తవాన్ని ఎందుకు అంగీకరించడం లేదంటూ గుజరాత్, బీహార్, హర్యానా ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఈ రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని ఇప్పటికే నివ్వెర పరిచాయని, ఆహారోత్పత్తులు కూడా గణనీయంగా తగ్గిపోయాయని తెలిపారు. ‘ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన కేసు..’ అని స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో కేవలం 526 జిల్లాలే కరవుబారిన పడ్డాయని గుజరాత్ ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేయడంతో మరింతగా మండిపడ్డ న్యాయమూర్తులు ‘కనీసం ఈ జిల్లాలనైనా కరవు పీడిత ప్రాంతాలుగా ఇప్పటి వరకూ ఎందుకు ప్రకటించలేదు..’ అని ప్రశ్నించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల మూలంగా ఆ ప్రకటన చేయలేకపోయామని ఆయన చెప్పడంతో ‘ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మనమంతా పనులు మానేసుకుని కూర్చుంటామా..’అని కనె్నర్ర చేశారు. ఎన్నికలు జరుగుతున్నంత మాత్రాన అన్నీ ఆగిపోవడానికి వీల్లేదన్నారు. కరవు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్న బలమైన సంకేతాలు గత ఏడాది సెప్టెంబర్ నెలలోనే స్పష్టమైనా ‘కరవు పరిస్థితిని ప్రకటించడానికి 2016 ఏప్రిల్ పదహారు వరకూ ఎందుకు ఆగాల్సి వచ్చింది’అని గుజరాత్ ప్రభుత్వ తరపు న్యాయవాదిని నిలదీశారు. ఇంకెంత మాత్రం జాప్యం లేకుండా కరవు ప్రాంత రైతులకు ప్రత్యేక ప్యాకేజీలను విడుదల చేయాలని ఆదేశించారు. కరవు కాటకాలు తీవ్రస్థాయిలో తాండవిస్తున్నా అవి ఇంత వరకూ ఎందుకు పట్టలేదని హర్యానా ప్రభుత్వంపై కూడా సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘ప్రజలు చనిపోతున్నారన్న వాస్తవాన్ని మరిచిపోకండి. ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే చర్యలు తీసుకోండి..ఇది పిక్నిక్ కాదు’అని పేర్కొంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాది కొన్ని పత్రాలను ధర్మాసనానికి నివేదించారు. అయితే ఇవన్నీ కూడా పాత లెక్కలు కావడం సుప్రీంకు మరింత ఆగ్రహం తెప్పించింది. మొత్తం 12 రాష్ట్రాల్లో గత రెండు సంవత్సరాలుగా నెలకొన్న కరువు పరిస్థితులపై దాఖలైన ప్రజాహిత పిటిషన్‌లోని అంశాలకు, హర్యానా సర్కార్ నివేదికకు ఎక్కడా పొంతన లేదని పేర్కొంది. తమ రాష్ట్రంలో ఆహారోత్పత్తులు పడిపోలేదు కాబట్టే కరవు పరిస్థితిని ప్రకటించడం లేదని హర్యానా న్యాయవాది వివరించారు. కాలువలు, బోరుబావుల ద్వారా సరఫరా చేసే నదీ జలాలపైనే తమ రాష్ట్ర రైతులు ఆధారపడతారని తెలిపారు. అసలు తమ రాష్ట్రంలో కరవు పరిస్థితులే లేవని బీహార్ ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అసలు రాష్ట్రాలు అమలు చేయనప్పుడు కేంద్ర ప్రభుత్వం కరవు పరిస్థితులకు సంబంధించిన మార్గదర్శకాలను ఎందుకు జారీ చేస్తుందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో పేదలకు లభించాల్సిన ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాకరించడానికి వీల్లేదన్నారు.