జాతీయ వార్తలు

ఇంకా తెరచుకోని ఎటిఎంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ ముంబయి, నవంబర్ 17: దేశంలో కరెన్సీ కొరతపై అటు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) చెబుతున్న మాటలకు, ఇటు వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరటం లేదు. పది రోజుల క్రితం అకస్మాత్తుగా ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు వల్ల మార్కెట్‌లో ద్రవ్య చలామణి తీవ్రంగా పడిపోయి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పది రోజులయినా పరిస్థితిని చక్కదిద్దే చర్యలు కార్యరూపం దాల్చకపోవడంతో దేశవ్యాప్తంగా ఎటిఎం వ్యవస్థ దాదాపుగా కుంటుపడిపోయింది. నోట్లు లేకపోవడంతో అనేక ఎటిఎంలు మూసివేసే ఉంటున్నాయి. ఎక్కడో ఓ చోట కొన్ని ఎటిఎంలలో అప్పుడప్పుడు అందుబాటులో ఉంచుతున్న రూ.వంద నోట్లు కొద్ది సేపట్లోనే అయిపోతున్నాయి. ఇలా నోట్లు అయిపోగానే క్యూలైన్లలో అప్పటివరకు ఎంతో సేపటి నుంచి వేచి ఉంటున్న ప్రజలు ఉసూరుమంటూ తిరిగి వెళ్లిపోతున్నారు. రద్దయిన పాత నోట్ల మార్పిడికే కాకుండా తమ రోజువారీ అవసరాల కోసం తమ ఖాతాల్లోని నగదును తీసుకోవడానికి కూడా సామాన్య ప్రజలు దేశంలో ఎక్కడ చూసినా వివిధ బ్యాంకుల శాఖల ముందు భారీ క్యూలైన్లలో గంటల తరబడి నిలబడుతున్న పరిస్థితి గురువారం కూడా కొనసాగింది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, కరెన్సీ నోట్ల సరఫరా తగినంతగా ఉందని, సుమారు రెండు నెలల ముందే కొత్త నోట్ల ఉత్పత్తి ప్రారంభమయిందని ఆర్‌బిఐ గురువారం మరోసారి ప్రకటించింది. అందువల్ల ప్రజలు నగదు గురించి భయాందోళనలు చెందకూడదని, నగదును కూడబెట్టుకోవద్దని కోరింది.
దేశ వ్యాప్తంగా ద్రవ్య చలామణి తీవ్రంగా పడిపోవడంతో నగదుతో లావాదేవీలు జరిపే కూరగాయల అమ్మకందారులు, దాబాలు, చిన్న కిరాణా దుకాణాల యజమానులు వంటి చిన్న వ్యాపారులు చితికిపోతున్నారు. వీరి వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సిమెంటు, ఇసుక, ఇతర సామగ్రి సరఫరా నిలిచిపోవడంతో నిర్మాణ రంగం కుదేలయింది. దీంతో నిర్మాణ రంగంపై ఆధారపడిన రోజువారీ కూలీలు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. డ్రైవర్ల వద్ద చెల్లుబాటయ్యే కరెన్సీ లేకపోవడంతో సరుకు రవాణా ట్రక్కులు హైవేల వెంట నిలిచిపోయాయి. దీంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో సరుకు రవాణా నిలిచిపోయింది. అయితే పాత నోట్ల మార్పిడి చేసుకునే వారి వ్రేలిపై మాయని సిరా చుక్క పెట్టడం ప్రారంభించడంతో బ్యాంకుల శాఖల వద్ద ఇలాంటి వారి రద్దీ గురువారం కొంతవరకు తగ్గింది.

చిత్రం.. ముంబయలోని భివాండిలో పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు వద్ద బారులు తీరిన జనం