జాతీయ వార్తలు

నగదు మార్పిడి రెండు వేలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: నగదు మార్పిడిపై నేటి నుంచి రోజుకు రెండు వేలు మించి ఇచ్చేది లేదని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగున్నర గురువారం రెండు వేలకు కుదించింది. నగదు కొరతను దృష్టిలో పెట్టుకుని మార్పిడిపై ఇచ్చే మొత్తాన్ని తగ్గించినట్టు తెలిపింది. కాగా కొత్త రూ. 2000, రూ. 500 నోట్లను పంపిణీ చేయడానికి వీలుగా ఎటిఎంలను సరిచేసే కార్యక్రమాన్ని (రీకాలిబ్రేషన్) వెంటనే చేపడతామని, గురువారమే 22,500 ఎటిఎంలను రీకాలిబ్రేట్ చేస్తామని ఆయన తెలిపారు. రూ. 500, 1,000 నోట్ల రద్దుతో దేశంలో నెలకొన్న పరిస్థితిని జైట్లీ గురువారం సమీక్షించారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల వద్ద ప్రజల రద్దీ క్రమంగా తగ్గుతోందని ఈ సమీక్షలో తేలినట్లు జీ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అన్ని బ్యాంకుల శాఖలు, ఎటిఎం కేంద్రాల వద్ద, నగదు రవాణా చేసే వాహనాలకు తగిన భద్రత కల్పించాలని కేంద్రం ఇదివరకే అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. రద్దయిన పాత నోట్లను మార్చుకునేందుకు, రోజువారీ అవసరాల కోసం తమ ఖాతాలనుంచి నగదు తీసుకోవడానికి దేశవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో, నోట్ల రద్దు వల్ల దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రయోజనాలు కలుగుతాయని, అందువల్ల కాస్త ఓపిక పట్టాలని కేంద్రం ప్రజలను కోరుతోంది.
మార్పిడి పరిమితి తగ్గింపు
ప్రజలు తమ వద్ద ఉన్న రద్దయిన పాత నోట్లను మార్చుకోవడానికి విధించిన పరిమితిని రూ. 4,500 నుంచి రూ. 2,000కు తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ తగ్గించిన పరిమితి శుక్రవారం నుంచి అమలులోకి వస్తుందని వివరించారు. వివాహ కార్యక్రమాలు ఉన్నవారు తమ బ్యాంకు ఖాతా నుంచి రూ. 2.5 లక్షల వరకు నగదును తీసుకోవచ్చని ఆయన వివరించారు. ‘కుటుంబంలోని ఒకరు పెళ్లి కుమారుడు లేదా పెళ్లి కుమార్తె తండ్రి లేదా తల్లి వివాహ ఖర్చుల కోసం తన ఖాతా నుంచి రూ. 2.5 లక్షల వరకు తీసుకోవచ్చని ఆయన వివరించారు.
ప్రభుత్వం వద్ద తగినంత నగదు ఉందని ఆయన వెల్లడించారు. గ్రూప్ సి స్థాయి వరకు గల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనంలోంచి అడ్వాన్స్‌గా రూ. పది వేల వరకు నగదు తీసుకోవచ్చని, ఈ మొత్తాన్ని వారి నవంబర్ నెల వేతనంలో సర్దుబాటు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ సమావేశమై, అన్ని ఎటిఎంలను రీకాలిబ్రేట్ చేయటానికి రోడ్ మ్యాప్‌ను తయారు చేసిందని శక్తికాంత దాస్ తెలిపారు. త్వరలోనే ఈ రీకాలిబ్రేట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.