జాతీయ వార్తలు

ఏ రోజైనా జయ డిశ్చార్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 17: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేగంగా కోలుకుంటున్నారు. శ్వాసకోస సంబధిత వ్యాధి నుంచి జయలలిత పూర్తిగా కోలుకున్నారని, సొంతంగానే శ్వాస తీసుకోగలుగుతున్నారని అధికార అన్నాడిఎంకె వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆమెను ఏ రోజైనా అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జిచేసే అవకాశం ఉందని పార్టీ ప్రతినిధి సి పొన్నయ్యన్ తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి ఇదే ఆసుపత్రిలో జయ చికిత్సపొందుతున్నారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా మెరుగైందని, గుండె కూడా బాగా పనిచేస్తోందని ఆయన చెప్పారు. వచ్చిన వారిని చిరునవ్వుతో పలకరించడమే కాకుండా పలకరిస్తున్నారని, ఆమె సొంతంగా ఆహారం తీసుకుంటున్నారని పేర్కొన్నారు.