జాతీయ వార్తలు

700 పెట్రోలు బంకుల్లో డెబిట్ కార్డులపై నగదు సదుపాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఏర్పడిన నగదు కొరతను తగ్గించడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా పెట్రోల్ బంకుల్లో డెబిట్ కార్డులను స్వైప్ చేసి 2 వేల రూపాయల నగదును తీసుకునే సదుపాయం శుక్రవారం దేశవ్యాప్తంగా దాదాపు 700 పెట్రోల్ బంకుల్లో ప్రారంభమైంది. ఈ సదుపాయాన్ని ఈ వారాంతానికి 2,500 పెట్రోలు బంకులకు విస్తరించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ సదుపాయం 20 వేల పెట్రోల్ బంకుల్లో లభ్యమవుతుంది. స్టేట్ బ్యాంక్ ఇండియా(ఎస్‌బిఐ)కి చెందిన పాయింట్ ఆఫ్ సేల్స్(పిఓఎస్) మిషన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో డెబిట్ కార్డులను స్వైప్ చేయడం ద్వారా ఒక వ్యక్తికి రోజుకు 2 వేల రూపాయల నగదు ఇవ్వడానికి అనుమతించాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించిన విషయం తెలిసిందే. పెట్రోల్ బంకుల్లో ఇప్పటికీ పాత 500, వెయ్యి రూపాయల నోట్లను తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సదుపాయం ఈ నెల 24 వరకు కొనసాగుతుంది. కాగా, పెట్రోలు బంకుల్లో పెట్రోలియం ఉత్పత్తులకు కొరత లేదని, వినియోగదారులు తమ అవసరాలకు తగినట్లుగా వాటిని కొనుగోలు చేయవచ్చని కూడా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. నగదు ఇచ్చే సదుపాయం 686 పెట్రోల్ బంకుల్లో ప్రారంభమయిందని ఆ ప్రకటన తెలిపింది. ఈ బంకుల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసి)కి చెందినవి 350 కాగా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బిపిసిఎల్)కు చెందినవి 266, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్)కు చెందినవి 70 పెట్రోల్ బంకులున్నాయని కూడా ఆ ప్రకటన తెలిపింది.
కాగా, పెట్రోలు, డీజిలు కొనుగోలుకు వినియోగదారులు క్రెడిట్, డెబిట్ కార్డులు, మొబైల్ వాలెట్లు, లాయల్టీ ప్రోగ్రామ్‌లు లాంటి నగదురహిత లావాదేవీలను ఉపయోగించుకోవాలని, దానివల్ల వినియోగదారులకు నగదుకు సంబంధించిన ఇబ్బందులుండవని కూడా ఆ ప్రకటన తెలిపింది.

చిత్రం.. శుక్రవారం డెబిట్ కార్డుపై హైదరాబాద్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో నగదు పంపిణీ చేస్తున్న దృశ్యం