జాతీయ వార్తలు

ఈ మరణాలకు ఎవరిది బాధ్యత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశంలో 500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న రాక్షస నిర్ణయం వల్ల ఇప్పటి వరకూ 55మంది మరణించారని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ఇందుకు సంబంధించి దేశానికి, మృతుల కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. నగదు కోసం బ్యాంకులు, ఎటిఎమ్‌ల వద్ద గంటల తరబడి నిలబడాల్సి రావడం వల్లే వీరందరూ మరణించారని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. వీరందరి మరణాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అనాలోచితంగా నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, దేశ వ్యాప్తంగా ఆందోళనకర వాతావరణం నెలకొందని అన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వడంతో పాటు, వారి మరణాలకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరపాలని, బాధ్యులను శిక్షించాలని సుర్జేవాలా కోరారు. ముందు నిర్ణయం తీసుకుని తర్వాత ఆలోచించే వ్యక్తిగా మోదీని ఆయన అభివర్ణించారు.

చిత్రం.. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్‌శర్మ