జాతీయ వార్తలు

మళ్లీ ప్రొఫెసర్‌గా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఏప్రిల్ 7: దాదాపు అర్ధ శ తాబ్దం తరువాత మా జీ ప్రధానమంత్రి మ న్మోహన్ సింగ్ మళ్లీ పాఠాలు బోధించబోతున్నారు. పం జాబ్ యూనివర్సిటీలో జవహర్‌లాల్ నెహ్రూ చైర్ ప్రొఫెసర్ పదవిని మన్మోహన్ అం గీకరించారు. మన్మోహన్ లాంటి గొప్ప ఆర్థిక శాస్తవ్రేత్తలు యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులతో కలిసి.. పాఠాలు చెప్పటం చాలా ఆనందంగా ఉందని పంజాబ్ వర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ గ్రోవర్ అన్నారు. మన్మోహన్ చండీగఢ్ వచ్చినప్పుడు నేరుగా పాఠాలు చెప్తారని.. రాని సందర్భంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠాలు బోధిస్తారన్నారు. 1954లో పంజాబ్ వర్సిటీలో ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగీ సంపాదించిన మన్మోహన్ 1957 నుంచి 66వరకు అదే వర్సిటీలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తరువాత ఐక్యరాజ్యసమితి సచివాలయంలో అర్థిక వ్యవహారాల అధికారిగా నియమితులయ్యారు.