జాతీయ వార్తలు

సిరాలో ‘వేలు’ పెట్టవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో పాత నోట్లు మార్చుకోవడానికి వచ్చేవారికి ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే వారికి వేసే సిరా గుర్తును వాడడం పట్ల ఎన్నికల కమిషన్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది.
కొన్ని పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ నెల 19న వాటికి ఎన్నికలు జరగనున్నాయని, ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటు వేసే వ్యక్తి ఎడంచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు పెట్టవలసి ఉంటుందని ఎన్నికల కమిషన్ ఆర్థిక మంత్రిత్వ వాఖకు రాసిన ఒక లేఖలో పేర్కొంది. ఒక వేళ ఓటరుకు ఎడంచేయి చూపుడు వేలు లేని పక్షంలో వేరే వేలికి గుర్తు పెట్టాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో పాత నోట్లు మార్చుకోవడానికి బ్యాంకులకు వచ్చే వారి వేలికి సిరా గుర్తు పెట్టడం వల్ల గందరగోళం నెలకొనే అవకాశముందని ఇసి ఆ లేఖలో పేర్కొంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లాంటి కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యాను సిరా గుర్తులు పెట్టడం వల్ల గందరగోళం తలెత్తే అవకాశముందని ఇసి స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియపై ఏ విధంగాను ప్రభావం చూపించే ఎలాంటి ప్రక్రియను నోట్ల రద్దు ప్రక్రియలో తీసుకోవద్దని ఇసి ఆర్థిక శాఖను కోరింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తమ వద్ద ఉన్న పాత 500, వెయ్యి రూపాయల నోట్లను మార్చుకోవడానికి జనం బ్యాంకుల ముందు బారులు తీరుతున్న విషయం తెలిసిందే. అయితే రోజులు గడుస్తున్నప్పటికీ ఈ క్యూలు ఎంతమాత్రం తగ్గకపోవడంపై కేంద్రం దృష్టిపెట్టింది. పాత నోట్లు మార్చుకుంటున్న వారు రోజులో ఒకటికంటే ఎక్కువ సార్లు బ్యాంకుకు వస్తున్నారని, దీనివల్లనే బ్యాంకుల వద్ద రద్దీ తగ్గడం లేదని గ్రహించిన కేంద్రం గురువారంనుంచి నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుకు వచ్చే వారి కుడిచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు పెట్టాలనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారం దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది.