జాతీయ వార్తలు

మానసిక ఆరోగ్యాన్ని హరిస్తున్న నగదు కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 18: పెద్ద నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పశ్చిమ బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో నగదు సమస్యను ఎదుర్కొంటున్న పలువురు వ్యాపారుల మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతోంది.
నగదు రూపంలో జరుగుతున్న వీరి అమ్మకాలన్నీ పెద్ద నోట్ల రద్దుతో అకస్మాత్తుగా నిలిచిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయల విలువైన బంగాళా దుంపలను శీతల గిడ్డంగిలో నిల్వ చేసుకున్న ఒక హోల్‌సేల్ వర్తకునికి పెద్ద నోట్ల రద్దుతో రెండు రోజులకే భయం పట్టుకుని గుండెపోటు మొదలైంది. అప్పుతో భారీగా బంగాళా దుంపలు కొని చిన్న వర్తకులకు అమ్ముకునే ఈ వర్తకునికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం శరాఘాతమైంది. పెద్ద నోట్ల రద్దు వలన నగదు కొరత తలెత్తి అమ్మకాలు నిలిచిపోయాయన్న ఆందోళన కారణంగానే అతనికి గుండెపోటు వచ్చిందని సీనియర్ మానసిక వైద్య నిపుణుడు సంజయ్ గార్గ్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో మానసికంగా వత్తిడికి గురైన పలువురు వ్యక్తులు ఇదేవిధమైన సమస్యలతో తమను సంప్రదించారని, వీరంతా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారేనని గార్గ్ వివరించారు.