జాతీయ వార్తలు

పార్లమెంటులో చర్చను కాంగ్రెస్ అడ్డుకోవడం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా లేదనే సందేహం ప్రజలకు కలుగుతోందని టిఆర్‌ఎస్ ఎంపి బి.వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చ జరగనీయకుండా కాంగ్రెస్ అడ్డుకోవడం సరికాదన్నారు. శనివారం నాడు ప్రధాని నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ అవుతారని వెల్లడించారు. ఇప్పటికే ప్రధానితో కెసిఆర్ మాట్లాడారని, రోజువారీ కూలీల ఇబ్బందుల్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారని వెల్లడించారు. నోట్ల రద్దు ప్రభావం, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎలా పరిష్కరించాలన్న విషయాలను చర్చిస్తారని వెల్లడించారు. ఈ నిర్ణయంతో సగటు మనిషి బతకలేని పరిస్థితి వస్తే చాలా ప్రమాదమని అన్నారు. మంచి జరుగుతుందన్న నమ్మకంతోనే ప్రజలు ఓపిక పడుతున్నారని తెలిపారు. ఈ నిర్ణయంపై పార్లమెంట్‌లో చర్చించాల్సిన అవసరం ఉందని, ఏ రూల్ కింద కాంగ్రెస్ పార్టీ గోల చేస్తోందని ప్రశ్నించారు. మొదట కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించింది. ఇప్పుడు ప్రజల సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించనీయకుండా కాంగ్రెస్ అడ్డుకోవడం సరికాదన్నారు.