జాతీయ వార్తలు

వరుసపెట్టి నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: కేంద్రం అనుకున్నంత పని చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కలుగుల్లో దాచిన ధనాన్నంతా బ్యాంకులకు రప్పించిన సర్కారు ఇప్పుడు అధికమొత్తాల్లో డిపాజిట్లు చేసిన వారికి చెక్ పెట్టడం మొదలు పెట్టింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ. 2.50 లక్షలకు మించి డిపాజిట్లు చేసిన వాటిలో అనుమానాస్పదంగా ఉన్నట్లు బ్యాంకులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఆదాయపు పన్నుశాఖ దేశ వ్యాప్తంగా వందలాది నోటీసులు జారీ చేసింది. రద్దయిన నోట్లను చెల్లుబాటు చేసుకోవటానికి వీలుగా రూ.2.5లక్షల వరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా డిపాజిట్లు చేసుకోవచ్చని అంతకు మించిన డిపాజిట్లపై ఐటి పరిశీలిస్తుందని ముందుగా ప్రకటించిన విధంగానే ఐటి చర్యలు తీసుకోవటం మొదలుపెట్టింది. అధిక మొత్తాల్లో డిపాజిట్లు చేసిన వారు ఆ మొత్తం ఆదాయం ఏ రూపంలో వచ్చిందో తెలియజేయాలని ఆ నోటీసుల్లో కోరింది. ఆదాయపన్ను శాఖ అధికారులు దేశవ్యాప్తంగా ఎంక్వయిరీలు చేయడం మొదలు పెట్టారని, ఆదాయం పన్ను చట్టంలోని 133(6) సెక్షన్ కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు చెప్పారు. కొన్ని ఖాతాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తాల్లో బ్యాంక్ అధికారులు ఐటి శాఖకు తెలియజేసారని అధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రెండు పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో పన్ను ఎగవేత దారులు, మనీ లాండరింగ్, నల్లధనంపై నిఘా వేయటం ఆదాయపు పన్ను శాఖ సాధారణ విధి అని అధికారులు స్పష్టం చేశారు. డిపాజిట్లకు సంబంధించిన పత్రాలు, ఖాతా పుస్తకాలు, బిల్ పుస్తకాలను సమర్పించాలని నోటీసులు ఇచ్చిన వారిని ఆదాయపు పన్ను శాఖ కోరింది. ఒకవేళ పన్ను చెల్లింపుదారు అయితే గత రెండు సంవత్సరాలకు సంబంధించిన టాక్స్‌రిటర్న్‌లను సమర్పించాలని సూచించింది. దీంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బులియన్ వ్యాపారులు, అనుమానాస్పద హవాలా ఆపరేషన్లపై కూడా ఐటి శాఖ సునిశిత నిఘా పెట్టింది. సహకార బ్యాంకుల వద్ద ఆదాయపు పన్నుశాఖ నిఘాకు పెద్ద చేపలే చిక్కాయి. మంగళూరులో అయిదు సహకార సంఘాలు ఎకంగా 8కోట్ల రూపాయలు ఒకే సహకార బ్యాంకులో డిపాజిట్ చేశాయి. వందలాది చారిటబుల్ ట్రస్టులు, మత సంస్థలకు కూడా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వెళ్లిపోయాయి. ఈ ట్రస్టులు, సంస్థలన్నీ దశాబ్దాలుగా ఆదాయపు పన్ను మినహాయింపు సౌకర్యాన్ని అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. నల్లధనాన్ని తెలుపు చేసుకునేందుకు ఈ సంస్థలకు విరాళాల రూపంలో అందుతున్న పాతనోట్లపై కూడా ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది.

చిత్రం.. తమ వద్దనున్న పాతనోట్లను డిపాజిట్ చేసేందుకు ఢిల్లీలోని ఒక బ్యాంక్ వద్ద వరుసలో నిలబడ్డ జనం