జాతీయ వార్తలు

బ్యాంకుల వద్ద తగ్గిన క్యూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: పెద్ద నోట్లను రద్దు చేసి పది రోజులు గడిచి పోయిన తర్వాత బ్యాంకుల వద్ద కాస్త రద్దీ తగ్గినప్పటికీ ఎటిఎంల వద్ద మాత్రం రద్దీ పెరిగింది. రద్దయిన నోట్లను మార్చుకోవడంపై కొన్ని పరిమితులు విధించిన తర్వాత బ్యాంకుల వద్ద క్యూలు తగ్గిపోయాయి కానీ వారాంతం కావడంతో ఎటిఎంల వద్ద మాత్రం రద్దీ ఏమాత్రం తగ్గలేదు. శనివారం నాడు బ్యాంకులు నగదు మార్పిడికి తమ ఖాతాదారులను, సీనియర్ సిటిజన్లను మాత్రమే అనుమతిస్తామని ప్రకటించడంతో క్యూలు చాలావరకు తగ్గిపోయాయి. బ్యాంకుల వద్ద రద్దీ బాగా తగ్గిపోయిందని, జనంలో ఎక్కడా ఎలాంటి ఆందోళన కనిపించడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా అన్నారు. అయితే చిల్లర కొరత మాత్రం ఇంకా ఏమాత్రం తీరలేదు. పాలు, కూరగాయలు, పండ్లులాంటివి కొనడానికి చిల్లర నోట్లు దొరక్క జనం ఇబ్బంది పడుతుంటే, అదే చిల్లర సమస్య కారణంగా చిరువ్యాపారుల వ్యాపారాలు సైతం దెబ్బతింటున్నాయి.
ఇదిలా ఉండగా పెళ్లిళ్ల కోసం వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలనుంచి రూ.2.50 లక్షల రూపాయల దాకా విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతిస్తామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినప్పటికీ బ్యాంకులు మాత్రం దీనికి సంబంధించి ఆర్‌బిఐనుంచి స్పష్టమైన గైడ్‌లైన్స్ అందకపోవడంతో ఈ విత్‌డ్రాలను అనుమతించడం లేదు. బహుశా సోమ, మంగళవారాల్లో దీనికి సంబంధించి ఆర్‌బిఐనుంచి గైడ్‌లైన్స్ అందుతాయని ఆశిస్తున్నామని, అప్పటినుంచి అనుమతించడం జరుగుతుందని బ్యాంకు అధికారులు అంటున్నారు. తమకు తెలిసినంతవరకు పెళ్లి చేసుకునే వధువు, వరుడి తరఫు వారు వేర్వేరుగా విత్‌డ్రాలు చేసుకోవడానికి అనుమతించవచ్చని, అబ్బాయి లేదా అమ్మాయి, లేదా వారి తల్లిదండ్రులు ఈ విత్‌డ్రాలు చేసుకోవచ్చని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉషా అనంత సుబ్రహ్మణ్యన్ చెప్పారు. ప్రభుత్వం ప్రకటన వెలువడినప్పటినుంచి పెద్ద సంఖ్యలో జనం పెళ్లిళ్ల కోసం 2.50 లక్షల రూపాయలు విత్‌డ్రా చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో బ్యాంకులకు వెళ్తున్నారు కానీ అధికారులు మాత్రం అనుమతించడం లేదు. విత్‌డ్రాయల్స్ కోసం కస్టమర్లు సమర్పించాల్సిన వివరాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు బ్యాంకులకు ఇంతవరకు అందకపోవడమే ఈ విత్‌డ్రాలను అనుమతించక పోవడానికి కారణమని, ఒకటి,రెండు రోజుల్లో తమ బ్యాంక్ హెడాఫీసులనుంచి లేదా ఆర్‌బిఐనుంచి గైడ్‌లైన్స్ అందుతాయని ఆశిస్తున్నామని మిగతా బ్యాంకుల వారు కూడా చెప్తున్నారు.