జాతీయ వార్తలు

వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: పెద్దనోట్ల రద్దు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కేంద్రానికి తెలిపినట్టు మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ వెల్లడించారు. బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన సమావేశానికి శివాజీ హాజరయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించే పంటలు మార్కెట్‌లో కోనుగోలు చేసే పరిస్థితులు లేవని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని ఆయన చెప్పారు. వ్యవసాయానికి సంబంధించిన లావాదేవీలన్నీ నగదుతోనే ముడిపడి ఉన్నందున గ్రామాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొటున్నరని శివాజీ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే పరిస్థితుల్లో రైతులు లేరని, దీని ప్రభావం రబీ పంటపై ఉంటుందని యలమంచిలి చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంలో నల్లధనాన్ని అరికట్టేందుకు రిజిస్ట్రేషన్ రేట్లను తగ్గించాలని కేంద్రాన్ని కోరామన్నారు.