జాతీయ వార్తలు

కమలా అద్వానీకి కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ సతీమణి కమలా అద్వానీ అంత్యక్రియలు గురువారం ఇక్కడి నిగమ్ బోధ్ ఘాట్‌లో ఆత్మీయుల అశ్రు నయనాల మధ్య జరిగాయి. ప్రజలు సందర్శనార్థం పృథ్వీరాజ్ రోడ్డులోని అద్వానీ నివాసం వద్ద ఉంచిన ఆమె మృత దేహాన్ని అక్కడినుంచి నిగమ్ బోధ్ ఘాట్‌కు ఊరేగింపుగా తీసుకు వచ్చారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు అద్వానీ కుమారుడు జయం త్ చితికి నిప్పంటించడంతో ఆమె భౌతికకాయం అనంతవాయువుల్లో కలిసిపోయింది. కమలా అద్వానీకి తుది నివాళులర్పించిన వారి లో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన వారున్నారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, రవిశంకర్ ప్రసాద్,స్మృతి ఇరానీ, రాజ్యవర్ధన్ రాథోడ్, పీయూష్ గోయల్, ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ హర్యానా సిఎం మనోహర్‌లాల్ ఖట్టర్, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బిజెపి ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధే, పార్టీ ప్రధానకార్యదర్శి రామ్‌లాల్, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్, పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ, నటుడు అశుతోష్ రాణా, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్, అద్వానీ కుమార్తె ప్రతిభ, ఇతర కుటుంబ సభ్యులున్నారు.
కాగా, అంతకు ముందు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి కమలా అద్వానీకి నివాళి అర్పిస్తూ, ఆమె పార్టీలోని తమందరికీ తల్లిలాంటిదని, అద్వానీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన, ఆయనకు కొండంత అండ గా నిలిచిన వ్యక్తని అన్నారు.

చిత్రం అద్వానీ సతీమణి అంత్యక్రియలకు హాజరైన కేంద్రమంత్రి స్మృతిఇరానీ, రాహుల్‌గాంధీ