జాతీయ వార్తలు

పీడకలగా మిగిలిన పెళ్లి ప్రయాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుఖర్యాన్, నవంబర్ 20: పాట్నా లో సోమవారం జరగబోయే తన స్నేహితుడి పెళ్లికోసం ప్రమాదం జరిగిన ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన వ్యాపారవేత్త అరుణ్‌శర్మ కుటుంబం పాలిట ఈ ప్రయాణం ఓ పీడకలగా మిగిలిపోయింది. ఈ ప్రమాదంలో శర్మ, ఆయన భార్య, 11 ఏళ్ల కుమారుడు త్రియాంశ్ గాయాల పాలు కాగా, తొమ్మిదేళ్ల మరో కుమారుడి జాడ ఇంకా తెలియరాలేదు. దాదాపు పది గంటల పాటు బోగీలో చిక్కుపడిన ఈ ముగ్గురినీ ఆర్మీ జవాన్లు కాపాడగలిగారు. ప్రమాదం జరిగిన సమయంలో మిగతా ప్రయాణికుల మా దిరిగానే వీరు కూడా గాఢనిద్రలో ఉన్నారు. ఎస్-1 బోగీలో తామంతా గాఢనిద్రలో ఉన్నామని, తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ కుదుపు రావడంతో తామంతా కిందపడిపోయామని శర్మ చెప్పారు. చేతులకు అనేక చోట్ల గాయాలు తగిలిన శర్మ ప్రమాదం జరిగిన చోటికి 35 కిలోమీటర్ల దూరంలోని మాతి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గా యాల పాలయిన ఆయన భార్య నూపుర్ కూడా అదే ఆస్పత్రిలో ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు పది గంటలకు అంటే మ ధ్యాహ్నం 1గంట సమయంలో పూ ర్తిగా ధ్వంసమైన బోగీలో చిక్కుకు పోయి ఉన్న తమను ఆర్మీ జవాన్లు కాపాడారని శర్మ చెప్పారు. అయితే వారి రెండో కుమారుడు 9 ఏళ్ల త్రియాంశ్ జాడ మాత్రం ఇంకా తెలియరాలేదు. క్షతగాత్రుల్లో దాదాపు 70 మంది మాతి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా కాన్పూర్‌లోని ఉర్సలా, హల్లత్ ఆస్పత్రుల్లో మరి కొందరు చికిత్స పొందుతున్నారు. మిగతా ఆస్పత్రుల్లో ఎంక్వయిరీ చేయడం ద్వారా శర్మ దంపతుల కుమారుడి జాడ తెలుసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్ అయిన అర్చన చెప్పారు.

చిత్రం.. సహాయ కార్యక్రమాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు