జాతీయ వార్తలు

18కి ముందు ఎలాంటి చర్య తీసుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, ఏప్రిల్ 7: ఉత్తరాఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం విషయంలో ఈ నెల 18లోపు ఎలాంటి చర్య తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కేంద్రం ఎలాంటి చర్యకు పూనుకున్నా ఈ కేసులో పిటిషనర్ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఆదేశాలు జారీ చేయవలసి వస్తుందని కూడా ఉత్తరాఖండ్ హైకోర్టు హెచ్చరించింది. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫారసును సవాలు చేస్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి కె.ఎం. జోసెఫ్, న్యాయమూర్తి వి.కె.బిస్ట్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం కేంద్రానికి ఈ హెచ్చరిక చేసింది. ఈ నెల 18వ తేదీ వరకు వేచి ఉండాలని, ఆ లోగా అర్థం లేకుండా వ్యవహరించకూడదని ధర్మాసనం కేంద్రానికి గట్టిగా చెప్పింది. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను ఎత్తివేయగలనని కూడా హైకోర్టు కేంద్రాన్ని హెచ్చరించింది. అయితే ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను ఎత్తివేయడానికి సంబంధించి ఎలాంటి నిర్ణ యం తీసుకోవాలన్నా అంతకుముందే న్యాయస్థానాన్ని సంప్రదిస్తామని కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనానికి తెలియజేసింది. ‘రాష్టప్రతి పాలనను ఎత్తివేయడానికి సంబంధించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ముందే మీకు తెలియజేస్తాను’ అని కేంద్రం తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ధర్మాసనానికి చెప్పారు. హరీశ్ రావత్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ హామీ ఇచ్చింది. రాష్టప్రతి పాలనను విధిస్తూ కేంద్ర కేబినెట్ చేసిన సిఫారసును సవాలు చేస్తూ తొలుత పిటిషన్ దాఖలు చేసిన రావత్, తరువాత కేంద్రం రాష్టప్రతి పాలనను ఎత్తివేసి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనే ఆందోళనను వ్యక్తం చేస్తూ ఈ మధ్యంతర పిటిషన్‌ను దాఖలు చేశారు. తన ప్రధాన పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే కేంద్రం రాష్టప్రతి పాలనను ఎత్తివేస్తే గవర్నర్ ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తనకే ఇచ్చేట్లుగా ఆదేశాలు జారీ చేయాలని రావత్ తన మధ్యంతర పిటిషన్‌లో హైకోర్టును అభ్యర్థించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మార్చి 18న తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రావత్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం, ఫలితంగా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం విషయంలో గందరగోళం నెలకొనడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అదేరోజు బిజెపి.. గవర్నర్ కె.కె.పౌల్‌ను కలిసి తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరింది. రావత్ గత సోమవారం అసెంబ్లీలో బలం నిరూపించుకోవలసి ఉండగా, అంతకన్నా ఒక రోజు ముందు ఆదివారమే కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను విధించింది.