జాతీయ వార్తలు

మరింత ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చేతిలో నగదు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు ఆర్థిక శాఖ మరింత ఊరట కలిగిస్తూ పలు చర్యలను ప్రకటించింది. రబీ సీజన్ ప్రారంభమయిన దృష్ట్యా రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ యూనివర్శిటీలు, ఐసిఏఆర్‌కు చెందిన దుకాణాలనుంచి పాత 500 రూపాయల నోట్లను ఉపయోగించి గుర్తింపు పత్రాలను చూపించి విత్తనాలు, పురుగుల మందులు కొనుగోలు చేసుకోవచ్చని ఆ శాఖ సోమవారం తెలిపింది. ఇదే కాకుండా పంట బీమా ప్రీమియం చెల్లింపు గడువును మరో 15 రోజులు పొడిగించింది. అలాగే ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాదారులతో పాటుగా నగదు క్రెడిట్ ఖాతాలు కలిగి ఉన్న వారు కూడా వారానికి 50వేల రూపాయలు తమ ఖాతాలనుంచి విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది. కరెంట్ ఖాతాదారులు తమ ఖాతాలనుంచి వారానికి 50 వేల రూపాయలు విత్‌డ్రా చేసుకోవడానికి ఇంతకు ముందే ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ విత్‌డ్రాలన్నీ కూడా ప్రధానంగా 2 వేల రూపాయల నోట్లతోనే ఉంటాయని కూడా ఆర్‌బిఐ తెలిపింది.
రుణగ్రహీతలకు వెసులుబాటు
పాత నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులనుంచి రుంలు తీసుకున్న వారు వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ప్రభుత్వం వారికి సైతం భారీ వెసులుబాటు కల్పించింది. కోటి రూపాయల లోపు వ్యాపార, వ్యవసాయ, హోం, కారు లోన్లు, పర్సనల్ రుణాలు తీసుకున్న వారు నెలసరి వాయిదాలు చెల్లించడానికి 60 రోజుల పాటు వెసులుబాటు కల్పించింది. 60 రోజుల తర్వాత వాయిదాలు చెల్లించినా ఎలాంటి పెనాల్టీలు వసూలు చేయరని కూడా తెలిపింది.
వాయు మార్గంలో నగదు రవాణా
పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతుండడం, డిమాండ్‌కు తగినంతగా నగదు లేక బ్యాంకులు చేతులెత్తేసిన నేపథ్యంలో వీలయినంత తక్కువ వ్యవధిలో బ్యాంకులకు నగదును చేర్చడానికి ఆర్‌బిఐ పలు చర్యలను చేపట్టింది. నోట్ల ప్రింటింగ్ ప్రెస్‌లనుంచి దేశంలోని ఆర్‌బిఐ ప్రధాన కార్యాలయాలకు నగదును చేరవేయడానికి గతంలో దాదాపు మూడు వారాలు పట్టేది. అయితే ఇప్పుడు ఈ సమయాన్ని ఆరు రోజులకు కుదించిన ఆర్‌బిఐ అందుకు అనుగుణంగా పలు చర్యలు కూడా చేపట్టింది. హెలికాప్టర్లు, వాయుసేనకు చెందిన విమానాలతో పాటుగా అన్ని రకాల రవాణా సాధనాలను నగదు తరలింపుకోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఈ చర్యల ఫలితంగా మరో నాలుగైదు రోజుల్లో ప్రధాన పట్టణాల్లో పరిస్థితి మామూలు స్థాయికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.