జాతీయ వార్తలు

పాక్ పైశాచికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: జమ్ము కాశ్మీర్‌లోని మచ్చాల్ ప్రాంతంలో ముగ్గురు సైనికులను చంపి ఒక సైనికుడి శరీరాన్ని ముక్కలుగా నరికి పాకిస్తాన్ ముష్కరులు తమ పైశాచికత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ ఘాతుకంపై భారత్ నిప్పులు చెరిగింది. పాకిస్తాన్ సైన్యానికి గట్టి గుణపాఠం నేర్పించేందుకు సిద్ధమవుతోంది. పాకిస్తాన్‌కు చెందిన ప్రత్యేక దళాల సైనికులు మంగళవారం మధ్యాహ్నం సరిహద్దులు దాటివచ్చి జమ్ముకాశ్మీర్‌లోని మచ్చాల్ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న ముగ్గురు భారత సైనికులపై దొంగ దెబ్బ తీసి హతమార్చి ఒక సైనికుడి శరీరాన్ని ముక్కలుగా నరికి అతడి తలను తీసుకుపోయారు. దీనికి పెద్ద ఎత్తున ప్రతీకారం తీర్చుకోవాలని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరిక్కర్ సైన్యాన్ని ఆదేశించారు. పాకిస్తాన్ సైన్యం చేసింది అత్యంత హేయమైన విషయం, దీనికి ప్రతీకారం ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. పాకిస్తాన్ సైన్యానికి గట్టిగా బుద్ధి చెప్పటంతో పాటు కఠినంగా శిక్షించాలని సైన్యాన్ని ఆయన ఆదేశించారు. పాకిస్తాన్ సైనికులు దాదాపు నెల రోజుల క్రితం కూడా ఇలాగే చేసి ఒక భారత సైనికుడి శరీరాన్ని ముక్కలుగా నరికారు. దానికి ప్రతీకారంగా దాడులు చేసిన భారత సైన్యం ఆక్రమిత కాశ్మీర్‌లోని పాకిస్తాన్ శిబిరాలను ధ్వంసం చేసి భారీ నష్టాన్ని కలిగించింది. పాకిస్తాన్ ముష్కరుల ఘాతుకం గురించి సమాచారం తెలియగానే రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరిక్కర్ సైనికాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరిపారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి పరిస్థితి వివరించినట్లు తెలిసింది. పాకిస్తాన్ సైన్యానికి బుద్ది రావటంతోపాటు ఇక ముందు దురాగతాలకు పాల్పడేందుకు అధైర్యపడేలా మన ప్రతీకార చర్య ఉండాలని భారత సైన్యానికి పారికర్ స్పష్టం చేసినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించాయి. దీని ప్రకారం భారత సైనికులు పాక్‌పై ఏ క్షణంలోనైనా తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ సారి పాకిస్తాన్ సైన్యంపై జరిపే దాడి అత్యంత తీవ్రంగా, శక్తిమంతంగా ఉండవచ్చునని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉరీ సైనిక శిబిరంపై జరిగిన దాడికి ప్రతీకారంగా భారత సైనికులు ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లపై జరిపిన దాడుల్లో దాదాపు యాభై మంది మరణించటం తెలిసిందే. ఇప్పుడు ఇద్దరు సైనికుల తలలు నిరికి తీసుకుపోయినందుకు పాకిస్తాన్ సైనిక పోస్టులు, శిబిరాలపై మెరుపు దాడి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు రాహీల్ షరీఫ్ మరో వారం రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సమయంలో పాకిస్తాన్ సైన్యం ఇలాంటి దురాగతానికి పాల్పడటం గమనార్హం. రాహీల్ షరీఫ్ తన సైన్యాధ్యక్ష పదవిని నిలబెట్టుకునేందుకే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని అంటున్నారు. భారత దేశంతో గొడవ పెరిగి పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీస్తే తాను మరికొంత కాలం సైన్యాధ్యక్ష పదవిలో ఉండవచ్చునని రాహీల్ షరీఫ్ భావిస్తున్నారనే, అందుకే ఆయన భారత సైనిక పోస్టులపై దాడులు చేయిస్తున్నారని రక్షణ శాఖ అధికారులు అంటున్నారు.