జాతీయ వార్తలు

అదనపు బోగీయే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/కాన్పూర్, నవంబర్ 22: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ వద్ద ఇండోర్- పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ఫోరెన్సిక్ దర్యాప్తుకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే రైలుకు అదనపు బోగీని జోడించడమే ప్రమాదానికి కారణమైందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. సాధారణంగా ఈ రైలు 22 బోగీలతో నడుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన రోజున రైలుకు అదనంగా మరో బోగీని చేర్చారని, దీని కారణంగానే రైలుకు స్థిరత్వం లోపించి పట్టాలు తప్పడానికి దారితీసిందని ఆ వర్గాలు అంటున్నాయి. అయితే గత ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరగడానికి ముందు, ఎస్-1, బి-3 బోగీలు పెద్ద శబ్దంతో జెర్కింగ్ (కుదుపులు) ఇచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు కూడా చెబుతున్నారు. ఇదిలా ఉండగా రైల్వే సేఫ్టీ (తూర్పు సర్కిల్) కమిషనర్ పికె ఆచార్య ఈ ప్రమాదానికి వెనుక కారణాలపై అధికారికంగా దర్యాప్తును ప్రారంభించారు.ఆచార్య ప్రశ్నించిన వారిలో రైలు ఇంజన్ డ్రైవర్ జనక్ శర్మ, కోడ్రైవర్, పుఖ్రయా, ఝాన్సీ స్టేషన్ల మాస్టర్లు ఉన్నారు. ప్రమాదానికి సంబంధించి ఐదుగురు అధికారులను రైల్వే మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది.
రైలుకు చెందిన బోగీల్లో కనీసం ఒకదానిలో సమస్య ఉన్నట్లు శర్మకు సమాచారం అందిందని, ఆయన ఆ విషయాన్ని ఒక సీనియర్ అధికారికి మెస్సేజి కూడా పంపించారని, అయితే ఏదో ఒక విధంగా రైలును కాన్పూర్ చేర్చమని ఆ అధికారి ఆయనకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. శర్మ కాన్పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుఖ్రయా స్టేషన్ వద్ద కూడా రైలును ఆపి సమస్యను స్టేషన్‌మాస్టర్‌కు కూడా తెలియజేశారని, అయితే కాన్పూర్‌కు వెళ్లమని స్టేషన్ మాస్టర్ ఆదేశించినట్లు తెలుస్తోంది, ఇదిలా ఉండగా, రైలు ప్రమాదానికి సంబంధించి ఆ రైల్లో ప్రయాణిస్తున్న, అదనంగా ఏదయినా సమాచారం ఉన్న వాళ్లు ఆ సమాచారాన్ని ఆచార్యకు తెలియజేయాలని రైల్వే కోరింది.