జాతీయ వార్తలు

డిసెంబర్ 8న విచారిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దాఖలయిన పిటిషన్లను డిసెంబర్ 8న విచారిస్తామని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ప్రకటించింది. వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ నెల 8న తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వివిధ హైకోర్టులు, ఇతర కోర్టుల్లో దాఖలయిన పిటిషన్లపై విచారణలను నిలిపివేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించినందున ఈ పిటిషన్లపై డిసెంబర్ 8న విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జి రోహిణి, జస్టిస్ వికె రావులతో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే నోట్ల రద్దువల్ల చాలామంది జీవనోపాధి కోల్పోతున్నారని, ఇది తమ ప్రాథమిక హక్కులకు భంగకరమని, అందువల్ల తన పిటిషన్‌ను డిసెంబర్ 8కి ముందే విచారించాలని ఢిల్లీలో డిజైనర్ షోరూమ్ నిర్వహిస్తున్న పూజా మహాజన్ తన న్యాయవాది ఎ.మైత్రి ద్వారా వాదించారు.