జాతీయ వార్తలు

దురుద్దేశంతోనే రభస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రతిపక్షాలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు విమర్శించారు. గురువారం పార్లమెంటులోని తన కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు అంశంపై చర్చ జరగకుండా రాజకీయ దురుద్దేశంతోనే పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఉభయసభల్లో అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ప్రకటించారు. కాగా సభ జరగాలని అందరూ కోరుకుంటున్నారని, ఇకనుంచి సభ సజావుగా సాగుతుందని ఆయన చెప్పారు. 500, 1000 నోట్ల రద్దు అంశంపై విపక్షాలిచ్చిన బంద్ పిలుపువిఫలమైందని, అలాగే అక్రోస్ ర్యాలీకి కూడా ప్రజాదరణ లేదని తేలిపోయినట్టు మంత్రి పేర్కొన్నారు. నోట్ల రద్దు విషయంలో తామంతా ఒక్కటిగా ఉన్నామని ప్రతిపక్షాలు ప్రకటించుకోవడమే తప్ప వాస్తవానికి అందుకు విరుద్ధంగా జరుగుతోందని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీల్లో ఎక్కడా ఐక్యత లేదన్నారు. అదాయ పన్ను సవరణ చట్టంపై విపక్షాలు అనవసర ఆందోళనలు సృష్టిస్తున్నాయని వెల్లడించారు. నోట్ల రద్దు తర్వాత కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే పన్ను ఉంటుందని, గతంలో బంగారంపై విధించిన నిబంధనల్లో ఎలాంటి మార్పులూ లేవని వెంకయ్య నాయుడు చెప్పారు. వారసత్వంగా, వ్యవసాయ ఆదాయంద్వారా కొనుగోలు చేసిన బంగారంపై ఎలాంటి పన్నులూ ఉండవని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖలోని రెవిన్యూ విభాగం పూర్తి వివరణ ఇచ్చిదని గుర్తుచేశారు.

చిత్రం..రాజ్యసభలో మాట్లాడుతున్న వెంకయ్య