జాతీయ వార్తలు

నోట్ల రద్దు తర్వాత సరిహద్దుల్లో ఉగ్రదాడులు ఎందుకు పెరిగాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 2: సరిహద్దుల్లో భారతీయ జవాన్ల హత్యలపై బిజెపి మిత్రపక్షమైన శివసేన కేంద్రాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, పెద్ద నోట్ల రద్దుపై నవంబర్ 8న ప్రకటన వెలువడిన తర్వాత సరిహద్దుల్లో మన సైనికులపై దాడులు ఎందుకు పెరిగాయో చెప్పాలని ప్రశ్నించింది. ‘అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ చర్య ఉగ్రవాదుల వెన్ను విరుస్తుందని, ఎందుకంటే నిధులకోసం, ఉగ్రవాద దాడులు జరపడం కోసం వారు పెద్ద నోట్లపైనే ఆధారపడుతున్నారని తెలిపింది. ఒక వేళ అదే నిజమయి ఉంటే నవంబర్ 8 తర్వాత ఉగ్రవాద దాడులు ఎందుకు పెరిగాయి’ అని శివసేన పత్రిక ‘సామ్నా’ శుక్రవారం సంపాదకీయంలో ప్రశ్నించింది. అంతేకాదు నవంబర్ 8 తర్వాత అమరులైన జవాన్లపై రక్షణ శాఖ వివరణ ఇవ్వాలని కూడా శివసేన డిమాండ్ చేసింది. ‘ఒక వైపు సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని గౌరవిస్తున్నారు. అయితే మన జవాన్ల ప్రాణాలకు ఏమయినా గౌరవం మిగిలి ఉందా అనేది ప్రశ్న. సరిహద్దుల్లో మన జవాన్లు ప్రతి రోజూ చనిపోతున్నారు. ఇది గనుక ఆగని పక్షంలో మన రక్షణ సన్నద్ధతపై అనుమానాలు తలెత్తుతాయి’ అని శివసేన ఆ సంపాదకీయంలో పేర్కొంది. సరిహద్దుల్లో కాల్పులు ఆపాలని వేడుకొంటూ పాకిస్తాన్‌నుంచి తమ మంత్రిత్వ శాఖకు ఒక వినతి వచ్చిందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ విమర్శిస్తూ, పొరుగుదేశం (పాకిస్తాన్)మన ముందు తల వంచిందని, దానివైపునుంచి ఇక ఎలాంటి ఉగ్రవాద దాడుల ముప్పు ఉండదనే భావనను రక్షణ మంత్రి సృష్టించారని పేర్కొంది. అయితే పారికర్ తన మాటలు పూర్తి చేయడానికి ముందే పాకిస్తాన్ భారతీయ సైనిక శిబిరాలపై దాడులు చేసిందని, ఆయన చెప్పిన శాంతి అంతా ఆవిరై పోయిందని పేర్కొంది.