జాతీయ వార్తలు

అసోం బిజెపికే అనుకూలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో ప్రధానంగా అసోంపైనే బిజెపి గంపెడంత ఆశలు పెట్టుకుని ఉంది. వరసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌ని గద్దెదింపి ఈ సారి అక్కడ అధికార పీఠం దక్కించుకోవాలని బిజెపి గట్టిగానే ప్రయత్నిస్తోంది. అసోంలోని మొత్తం 3.2 కోట్ల జనాభాలో కోటీ పది లక్షల మంది ముస్లింలున్నారు. వీరి తర్వాతి స్థానాల్లో బెంగాలీ హిందువులు, తేయాకుతోట కార్మికులున్నారు. గతంలో ముస్లింలు ఎప్పుడూ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచేవారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం వారు ప్రధాన ముస్లిం పార్టీ అయిన ఏఐయుఎఫ్‌ను బలపరుస్తున్నారు. అలాగే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన దాదాపు 50 లక్షల దాకా ఉన్న తేయాకు తోటల కార్మికులు 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి బిజెపి వైపు మొగ్గారు. ఇక స్థానిక తెగ అయిన అహోమ్‌లు చాలావరకు ఇప్పటికీ కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తుండగా బోడోలు మాత్రం బోడోపార్టీ బిజెపితో చేతులు కలిపిన కారణంగా ఆ పార్టీ వైపు మొగ్గినట్లు కనిపిస్తోంది. ఈ సమీకరణాలను బట్టి చూస్తే బిజెపి విజయం సాధించే అవకాశాలు 60 శాతం దాకా ఉన్నట్లు ఎన్డీ టీవీ నిర్వహించిన విశే్లషణ అంచనా వేసింది.