జాతీయ వార్తలు

పాకిస్తాన్‌పై ముప్పేట దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, డిసెంబర్ 2: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో శనివారం నుంచి ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ వార్షిక సదస్సు ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై విస్తృతమైన చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత సైనిక శిబిరంపై పాక్ ముష్కర మూకలు మరోసారి దాడికి తెగబడటంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరిన విషయం విదితమే. దీంతో పాక్ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపేందుకు హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సులో సభ్య దేశాల మద్దతును కూడగట్టుకుని దౌత్యపరంగా దాయాది దేశాన్ని ఏకాకిని చేసేందుకు విస్తృత ప్రయత్నాలు చేయాలని భారత్ యోచిస్తోంది. మరోవైపు పాక్ భూభాగంలోని ఉగ్రవాద మూకల చేతిలో పదేపదే దాడులకు గురవుతున్న అఫ్గానిస్తాన్ కూడా ఈ విషయంలో భారత్‌తో గొంతు కలపనుంది. ఉగ్రవాదాన్ని ప్రతిఘటించేందుకు ప్రాంతీయ స్థాయి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో పాటు సభ్య దేశాలన్నీ ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండేలా ఈ సదస్సులో వత్తిడి తీసుకురావాలని అఫ్గానిస్తాన్ యోచిస్తోంది. యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గానిస్తాన్‌లో అభివృద్ధికి చేయూతనివ్వాలన్న సత్సంకల్పంతో ఇస్తాంబుల్ ఒడంబడిక ప్రకారం 2011లో హార్ట్ ఆఫ్ ఆసియా వేదిక ఏర్పాటైంది. దీనిలో సభ్యులుగా ఉన్న 14 దేశాల ఉన్నతాధికారులు శనివారం అమృత్‌సర్‌లో సమావేశమై ప్రాంతీయంగా ఎదురవుతున్న సవాళ్లు, ఉగ్రవాద గ్రూపుల నుంచి ఎదురవుతున్న సమస్యలపై చర్చించడంతో పాటు అఫ్గానిస్తాన్‌లో శాంతి, సుస్థిరతలను పాదుకొల్పేందుకు అనుసరించాల్సిన మార్గాలను అనే్వషించనున్నారు. ఈ సదస్సులో భాగంగా శనివారం జరుగనున్న ప్రధాన సమావేశాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ సంయుక్తంగా ప్రారంభిస్తారు. పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల్లో సలహాదారుగా వ్యవహరిస్తున్న సర్తాజ్ అజీజ్ ఈ సదస్సులో దాయాది దేశానికి ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ సదస్సు సందర్భంగా భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలేమైనా జరుగుతాయా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.