జాతీయ వార్తలు

వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం టిఆర్‌పి రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సిపిపి) సమావేశానికి తొలిసారి యువనేత రాహుల్ గాంధీ సారథ్యం వహించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అనారోగ్య కారణాల వలన శుక్రవారం ఈ సమావేశానికి రాలేకపోవడంతో రాహుల్ గాంధీ అధ్యక్షత వహించారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో జరిగిన ఈ సమావేశంలో ప్రసంగిస్తూ, ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మరోసారి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాకులాడుతున్న మోదీ టిఆర్‌పి రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఉన్న పళంగా పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ ఆడంబరం, అసమర్థతతో ప్రజలను తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టారని రాహుల్ ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల వలన ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో గగ్గోలు పెడుతుంటే మోదీ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల అభిప్రాయాలను మోదీ ఆలకించి ఉంటే ఇటువంటి ‘విపత్కరమైన’ విధాన తప్పిదాలకు పాల్పడేవారు కాదని అన్నారు. ‘ప్రజాస్వామ్య, రాజ్యాంగ సంస్థల్లోని అనుభవజ్ఞుల అభిప్రాయాలను పట్టించుకోని ప్రధాన మంత్రులను, వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాకులాడుతూ ప్రజలను తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టే ప్రధాన మంత్రులను, టిఆర్‌పి రాజకీయాలకు పాల్పడుతూ రేటింగ్‌ల కోసం విధాన నిర్ణయాలను చేసే ప్రధాన మంత్రులను మేము ఎన్నడూ దేశానికి ఇవ్వలేదు. ఇప్పుడు మన ప్రధాని ఆడంబరం, అసమర్థత వలన దేశానికి తీవ్రమైన నష్టం జరిగింది’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. సమర్థుడైన ప్రధాన మంత్రిగా మోదీ పేరు తెచ్చుకోవాలంటే వ్యక్తిగత ప్రతిష్ట నుంచి బయటపడి దేశ ప్రజల వాణిని ఆలకించడం ఒక్కటే మార్గమని, అయితే అందుకు ఆయన ససేమిరా అంటున్నారని రాహుల్ విమర్శించారు.