జాతీయ వార్తలు

తుది నిర్ణయం ములాయందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సమాజ్‌వాదీ పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఎలాంటి విముఖత లేనట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మెజారిటీ సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీని కలుపుకొని పోటీ చేస్తే 403 స్థానాలు గల అసెంబ్లీలో 300కు పైగా సీట్లను తమ కూటమి కైవసం చేసుకుంటుందని అఖిలేశ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే మాజీ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)తో మాత్రం పొత్తు పెట్టుకునే సమస్యే లేదని ఆయన తెగేసి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల తొలుత ఎస్‌పి అధినేత ములాయం సింగ్ యాదవ్‌తో, తరువాత ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయిన నేపథ్యంలో విలేఖరులు శుక్రవారం ఇక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ అఖిలేశ్ పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయా? అని ప్రశ్నించగా, తుది నిర్ణయం తీసుకోవలసింది తమ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అని, తాను సలహాలు మాత్రమే ఇవ్వగలనని ఆయన బదులిచ్చారు. అయితే పొత్తు పెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లలో పోటీ చేయవలసి ఉంటుందని, లాభనష్టాల గురించి ఆలోచిస్తే పొత్తు కుదరదని ఆయన అన్నారు. అంతకుముందు అఖిలేశ్ యాదవ్ హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడుతూ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నిర్ణయం ప్రజలందరినీ క్యూలలో నిలబెడుతోందని పేర్కొంటూ, ‘అచ్ఛే దిన్’ (మంచి రోజులు) అంటే ఇవేనా? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకోసమేనా ప్రజలు మోదీకి ఓటేసిందని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వసం చేసిందని విమర్శించారు. ఎస్‌పిలో అంతర్గతంగా శత్రువైన అమర్‌సింగ్‌పైనా అఖిలేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమర్‌సింగ్ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉన్నారా? అని ప్రశ్నించగా, ‘ఇదో పెద్ద కల’ అని ఆయన బదులిచ్చారు.