జాతీయ వార్తలు

సైన్యాన్ని మోహరిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా/ న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని టోల్ ప్లాజాల వద్ద సైనిక బలగాల మోహరింపు పెద్ద దుమారానికి తెరలేపింది. కేంద్రం తీసుకున్న ఈ చర్యను ‘సైనిక కుట్ర’గా అభివర్ణించిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైన్యం మోహరింపును నిరసిస్తూ గురువారం రాత్రంతా రాష్ట్ర సచివాలయమైన ‘నబన్నా’లోనే గడిపారు. మరోవైపు, సైనిక కుట్రంటూ మమత చేసిన ఆరోపణలను కేంద్రం శుక్రవారం తీవ్రంగా ఖండించింది. మమత రాజకీయ నిరాశా నిస్పృహలకు ఆమె వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని విమర్శించింది. ఈ దుమారం శుక్రవారం పార్లమెంటునూ తాకింది.
‘నేను సామాన్య ప్రజల సంరక్షకురాలిని. అందువల్ల నేను వారిని అభద్రతలో వదలివేయలేను. నేను ఈ రాత్రంతా ఇక్కడే ఉంటూ పరిస్థితిని పరిశీలిస్తాను’ అని మమత గురువారం రాత్రి సుమారు 1.30 గంటలకు సచివాలయంలో విలేఖరులకు చెప్పారు. టోల్ ప్లాజాల నుంచి ఆర్మీని ఉపసంహరించుకున్న తరువాత మాత్రమే తాను ఇంటికి వెళ్తానని తెగేసి చెప్పారు. మమత డిమాండ్ మేరకు సచివాలయం సమీపంలో గల రెండో హుగ్లీ వంతెన టోల్ ప్లాజా నుంచి సైనిక బలగాలను గురువారం రాత్రి ఉపసంహరించారు. అయితే హుగ్లీ వంతెన వద్ద నుంచి వారు వెళ్లిపోయి ఉండొచ్చని, కాని ఇతర 18 జిల్లాల్లో వారు ఉన్నారని మమత పేర్కొన్నారు.
అయితే సైనిక బలగాల మోహరింపును ‘సైనిక కుట్ర’గా మమతా బెనర్జీ చేసిన ఆరోపణను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శుక్రవారం పార్లమెంటులో తీవ్రంగా ఖండించారు. ఇది ప్రతి సంవత్సరం మామూలుగా జరిగే కసరత్తేనని పేర్కొంటూ, అనవసర వివాదాల్లోకి ఆర్మీని లాగడం తీవ్ర దురదృష్టకరమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా టోల్ ప్లాజాల వద్ద సైనిక బలగాలను మోహరించి, డబ్బులు వసూలు చేస్తున్నట్టు మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను ఆర్మీ గట్టిగా తోసిపుచ్చింది. కోల్‌కతా పోలీసుల సమన్వయంతోనే ఈ కసరత్తు నిర్వహిస్తున్నట్టు వివరించింది.
టోల్‌ప్లాజాల వద్ద సైనిక బలగాల మోహరింపును నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు గురువారం రాత్రి కోల్‌కతాలోని రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేశారు. ఇదిలా ఉండగా, ఈ అంశం శుక్రవారం పార్లమెంటు ఉభయ సభల్లో చర్చకు వచ్చింది.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా బెంగాల్‌లోని 19 టోల్ ప్లాజాల వద్ద సైన్యం మోహరింపుపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. లోక్‌సభలో రక్షణ మంత్రి పారికర్ వివరణ ఇస్తూ ఇది అన్ని రాష్ట్రాల్లోనూ జరిగే ప్రక్రియేనని, బెంగాల్‌కు ప్రత్యేకించింది కాదని తెలిపారు. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు భారీ వాహనాల కదలికల సమాచారాన్ని సేకరించే ఇలాంటి ఆపరేషన్లు గత నెలలో ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్‌లలో నిర్వహించినట్లు ఆయ న వివరించారు. బెంగాల్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ, మిజోరంలలో కూడా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన చెప్పారు. వాస్తవానికి నవంబర్ 28నుంచి 30వరకు ఈ కసరత్తు నిర్వహించవలసి ఉండగా, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్నందున డిసెంబర్ 1,2 తేదీలకు వాయిదా వేసుకోవాలని స్థానిక పోలీసులు ఆర్మీకి సూచించారని ఆయన వివరించారు.

చిత్రం.. సైన్యం మోహరింపును నిరసిస్తూ మాట్లాడుతున్న సిఎం మమతా బెనర్జీ