జాతీయ వార్తలు

ఆర్మీ ఆపరేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, డిసెంబర్ 3: దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగి ఒకరు మృతి చెందారు. ఉగ్రవాదులు మాత్రం భద్రతా బలగాల కన్నుగప్పి తప్పించుకోగలిగారు. అధికార వర్గాలు శనివారం ఇక్కడ తెలిపిన వివరాల ప్రకారం.. చాన్సర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు అందిన పక్కా సమాచారంతో సైనిక సిబ్బంది సహా భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని శుక్రవారం రాత్రి చుట్టుముట్టాయి. బలగాలు చుట్టుముట్టిన కొద్ది నిమిషాల్లోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మత్స్యశాఖకు చెందిన ఉద్యోగి అసదుల్లా కుమార్ మృతి చెందారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఎవరూ కనిపించకపోవడంతో భద్రతా బలగాలు శనివారం ఉదయం ఆపరేషన్‌ను నిలిపివేశాయి. శుక్రవారం రాత్రి చీకట్లో ఉగ్రవాదులు పారిపోయి ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇలావుండగా, ప్రభుత్వ ఉద్యోగి హత్యపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వెస్సు వద్ద శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని దిగ్బంధించి, రాకపోకలను అడ్డుకున్నారు.