జాతీయ వార్తలు

విదేశీ టూరిస్ట్‌పై రేప్ కేసులో ఎఫ్‌ఐఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది మార్చిలో ఓ అమెరికా మహిళా టూరిస్టుపై అత్యాచారానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ కన్నాట్‌ప్లేస్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో విదేశీ మహిళపై అత్యాచారం జరిగిందని ఓ స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత్ పర్యటనకు వచ్చిన ఆమె ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేశారని వారన్నారు. ఐదుగురు వ్యక్తులు గదిలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేశారని ఎన్‌జివో ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని రేపిస్టులు హెచ్చరించడంతో ఆమె ఎవరికీ చెప్పలేదని ఫిర్యాదులో వెల్లడించారు. స్వదేశం వెళ్లిపోయిన ఆమె తనపై జరిగిన దారుణం వివరించినట్టు వారు పేర్కొన్నారు. ఎన్‌జివో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసు ప్రతినిధి, నైరుతీ ఢిల్లీ జాయింట్ కమిషనర్ దీపేంద్ర పాథక్ శనివారం తెలిపారు.