జాతీయ వార్తలు

మా జీతాల విత్‌డ్రాకు అనుమతించడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: రాజధాని ఢిల్లీలో తమ హైకమిషన్‌లో పనిచేస్తున్న అధికారుల వేతనాలు విత్‌డ్రా చేసుకోకుండా భారత్ అడ్డంకులు కల్పిస్తోందని పాకిస్తాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. పెద్దనోట్ల రద్దు మిషతో తమ దౌత్య అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పాక్ ధ్వజమెత్తింది. భారత్ తీరు వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించింది. ‘మా దౌత్యాధికారులు వేతనాలు విత్‌డ్రా చేసుకోకుండా ఆపితే మేమూ ఇదే వైఖరిని అవలంబించాల్సి ఉంటుంది. పాక్‌లో ఉన్న భారత దౌత్యాధికారులకు ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని పాక్ హైకమిషన్ హెచ్చరించింది. పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగులకు ఇక్కడి ఆర్‌బిఎల్ అనే ఓ ప్రైవేట్ బ్యాంకులో సేలరీ అకౌంట్ ఉంది. ‘బ్యాంకునుంచి మా జీతాలు తీసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పిస్తోంది. పెద్దనోట్ల రద్దుకు మా జీతాల విత్‌డ్రాకు సంబంధమే లేదు. అయినా ఇబ్బంది పెడుతున్నారు’ అని సీరియన్ పాక్ హైకమిషన్ అధికారి విరుచుకుపడ్డారు. అయితే పాక్ ఆరోపణలపై భారత్ అధికారికంగా స్పందించలేదు. అయితే విత్‌డ్రా విషయం సదరు బ్యాంకు, ఖాతాదారుడికి సంబంధించేదే తప్ప ప్రభుత్వం ప్రమేయం ఏమీ ఉండదని అధికారులు పేర్కొన్నారు. దౌత్యాధికారులు డాలర్ల రూపంలో పన్నులేకుండా వేతనాలు తీసుకోవచ్చని అన్నారు.