జాతీయ వార్తలు

ఆర్మీపై ఆరోపణలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 3: ‘ఆర్మీ వంటి బాధ్యతాయుతమైన వ్యవస్థపై ఆరోపణలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి’ అంటూ పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి పరోక్షంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి హితవు పలికారు. బెంగాల్‌లోని కొన్ని టోల్ ప్లాజాల వద్ద సైనిక బలగాలను మోహరించడాన్ని నిరసిస్తూ, ‘సైనిక కుట్ర’కు పాల్పడుతున్నారా? అంటూ మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్మీకి సహాయ నిరాకరణ చేయొద్దు. ఆర్మీని అప్రతిష్టపాలు చేయొద్దు’ అని ఆయన అన్నారు. అయితే త్రిపాఠి చేసిన ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమని మమతా బెనర్జీ అన్నారు. గవర్నర్ కేంద్రం గొంతుతో మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. ‘గవర్నర్ కేంద్రం గొంతుతో మాట్లాడుతున్నారు. సుమారు ఎనిమిది రోజులు ఆయన నగరంలోనే లేరు’ అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రకటనలు చేయడానికి ముందు అన్ని వివరాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇది చాలా దురదృష్టకరం’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

చిత్రం..రాజ్‌భవన్‌లో శనివారం గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని కలిసి తిరిగి వస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రులు