జాతీయ వార్తలు

9 కిలోల బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 3: పెద్దనోట్ల రద్దు తర్వాత తాము ఇన్నాళ్లుగా దాచుకున్న డబ్బులను కాపాడుకోవడానికి నల్లకుబేరులు అనేక పాట్లు పడుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ముంబయిలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం రెండు కార్లలో తరలిస్తున్న 2.7 కోట్ల రూపాయల విలువైన 9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తి 9-10 కిలోల బంగారం తీసుకెళ్తున్నట్లుగా తమకు సమాచారం అందిందని క్రైమ్‌బ్రాంచ్ డిసిపి షాహికాంత్ సతవ్ చెప్పారు. రద్దయిన పాతవెయ్యి, 500 రూపాయల నోట్లతో మరో వ్యక్తి ఈ బంగారం కొనబోతుండగా, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పాడు. కారులో బంగారంతో మరో నలుగురైదుగురు వ్యక్తులు ఉన్నారని కూడా ఆయన చెప్పారు. వీరంతా ముంబయికి చెందినవారేనని, వీరు మార్కెట్ విలువకన్నా ఎక్కువ ధరకు బంగారాన్ని రద్దయిన పాతనోట్లకు విక్రయించడానికి పథకం వేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారానికి సంబంధించి అరెస్టయిన వ్యక్తులు సరయిన సమాధానాలు చెప్పలేదని, ఆదాయం పన్ను శాఖ వారు డాక్యుమెంట్లను చెక్ చేస్తున్నారని, తాము కూడా అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వివరాలను తెలుసుకుంటున్నామని ఆయన చెప్పారు. బంగారంపై స్విట్జర్లాండ్ తదితర దేశాల గుర్తులున్నాయని చెప్తూ, కస్టమ్స్ శాఖకు కూడా ఈ విషయమై సమాచారమిచ్చినట్లు తెలిపారు.